NBK108: బాలయ్య సినిమాకు షాకింగ్ టైటిల్.. ఐ డోంట్ కేర్ అంటూ వినూత్నంగా!
పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా హీరోగా వెలుగొందుతూ హవాను చూపిస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనదైన శైలి యాక్టింగ్‌తో సందడి చేసిన ఆయన.. ఎన్నో విజయాలను అందుకున్నారు. అదే సమయంలో తన ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుని సత్తా చాటారు. ఇలా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు. అయితే, ఆ మధ్య చాలా సినిమాలు పరాజయం పాలవడంతో బాలయ్య ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది వచ్చిన 'అఖండ'తో ఆయన మరోసారి హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ను అందుకున్నారు.
'అఖండ' మూవీ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణలో ఉత్సాహం రెట్టింపు అయిపోయింది. అందుకే ఈ మూవీ రిజల్ట్ ఇచ్చిన జోష్‌తో ఉన్న ఆయన.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులను అంతే ఉత్సాహంతో లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే గత ఏడాది 'క్రాక్' మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రస్తుతం సినిమా చేస్తున్నారు. పల్నాడు ఫ్యాక్షన్ నేపథ్యంతో నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే మొదలైన ఈ మూవీ షూటింగ్.. రెండు మూడు షెడ్యూళ్లను కూడా జరుపుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జూన్ 9న విడుదల చేయబోతున్నారు. ఇక, ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. ఇది పట్టాలపై ఉండగానే ఆయన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ప్రాజెక్టును కూడా లైన్‌లో పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు స్టార్లూ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక, ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తొలిసారి కామెడీకి ప్రాధాన్యత తగ్గించి ఓ పవర్‌ఫుల్ సబ్జెక్టును రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్టు వర్కు జరుగుతున్నట్లు ఆ డైరెక్టరే వెల్లడించాడు. ఇది పూర్తైన వెంటనే అంటే జూలై మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
నటసింహా నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమాకు 'Bro I Don't Care' బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారన్నదే ఆ వార్త సారాంశం. ఇది విన్న వెంటనే బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు సామాన్య సినీ ప్రియులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఈ స్టార్ హీరో టైటిళ్లు పవర్‌ఫుల్‌గా, తెలుగు ప్రధానంగా ఉంటాయి. కానీ, ఈ సారి మాత్రం ఇది వినూత్నంగా ఉండడంతో హాట్ టాపిక్ అవుతోంది.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి సరికొత్త పంథాలోకి మారబోతున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం గతంలో ఎన్నడూ చేయని కొత్త తరహా సబ్జెక్టును రెడీ చేస్తున్నాడట. ఇక, ఇందులో అంజలి, ప్రియమణి కీలక పాత్రలను చేస్తున్నారని అంటున్నారు. అలాగే, శ్రీలీలా.. బాలయ్య కూతురిగా నటించబోతుందట. దీంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.


Click it and Unblock the Notifications











