NBK109: బాలకృష్ణ సినిమాకు కొత్త టైటిల్.. అందుకే దాన్ని మార్చేశారా!
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. 'అఖండ'తో హిట్ ట్రాక్ ఎక్కిన ఆయన.. ఆ తర్వాత 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరి' చిత్రాలను చేసి సక్సెస్ సాధించారు. ఈ ఊపులోనే మరిన్ని ప్రాజెక్టులను ఓకే చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ ఇప్పుడు బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర డైరెక్షన్‌తో ఓ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 1980 దశకంతో పాటు ప్రస్తుతానికి సంబంధించిన కథతో రాబోతుంది. యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దీన్ని హై రేంజ్‌లో తీస్తున్నారు.

బాలయ్య మార్కకు ఏమాత్రం తీసిపోని స్టోరీలైన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే మొదలు పెట్టారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్, వైజాగ్, హైదరాబాద్‌తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ చిత్రీకరణ జరిపింది. ఇలా ఇప్పటికే 80 శాతం టాకీ పార్టును పూర్తి చేసుకుంది.
హై రేంజ్ యాక్టన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతున్నా దీనికి సంబంధించిన అప్‌డేట్లు మాత్రం ఆశించిన రీతిలో రావట్లేదు. ముఖ్యంగా ఈ చిత్రం టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించలేదు. దీంతో అసలు ఈ చిత్రానికి ఎలాంటి పేరు పెడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'వీరమాస్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు గతంలో న్యూస్ లీకైంది. కానీ, ఇప్పుడు ఈ పేరుపై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ టైటిల్‌పై బాలయ్య, బాబి పునరాలోచన చేశారట. అంతేకాదు, దీనికి మరో కొత్త పేరునే ఫైనల్ చేయాలని తాజాగా నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. బాలయ్య హీరోగా బాబీ తీస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, ఊర్వశీ రౌటేలా నటిస్తున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై ప్రకటన రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











