టాలీవుడ్‌లో సెన్సేషన్: వెంకటేష్, బాలయ్య, రవితేజ కాంబోలో మూవీ.. అసలైన ట్విస్ట్ ఏంటంటే!

తెలుగు ప్రేక్షకుల అభిరుచిలో యమా మార్పులు వస్తున్నాయి. ఈ కారణంగానే వాళ్లు కొత్త కొత్త ప్రయోగాత్మక చిత్రాలపై మక్కువ చూపిస్తున్నారు. అలాగే, భిన్నమైన కథలకు మంచి స్పందనను అందిస్తున్నారు. అన్నింటికీ మించి మల్టీస్టారర్ మూవీలకు జై కొట్టేస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఎక్కువగా అలాంటి చిత్రాలే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా వెలుగొందుతోన్న ముగ్గురు హీరోల కలయికలో ఓ సినిమా రాబోతుంది. దీన్ని అనిల్ రావిపూడి ప్లాన్ చేశాడు? ఆ వివరాలను మీరే చూసేయండి మరి!

అనిల్ రావిపూడి జోష్‌లో : కల్యాణ్ రామ్ నటించిన 'పటాస్'తో దర్శకుడిగా మారి.. అప్పటి నుంచి వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా సత్తా చాటుతోన్నాడు అనిల్ రావిపూడి. ఇలా ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. గత ఏడాది చివర్లో నందమూరి బాలకృష్ణతో 'భగవంత్ కేసరి' సినిమాను చేశాడు. ఇది అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ను అందించిన విషయం తెలిసిందే.

Balakrishna and Ravi Teja Special Roles In Anil Ravipudi and Venkatesh Movie

సక్సెస్ కోసం వెంకటేష్ : గతంలో ఎంతో వేగంగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చినా... ఈ మధ్య కాలంలో మాత్రం చాలా స్లో అయిపోయారు విక్టరీ వెంకటేష్. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గత సంక్రాంతికి 'సైంధవ్' అనే సినిమాతో వచ్చారు. కానీ, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఈ సీనియర స్టార్ హీరో సోలో సక్సెస్ కోసం మరింత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సంక్రాంతికి వస్తున్నాం : ఒకవైపు వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న అనిల్ రావిపూడి.. మరోవైపు సక్సెస్ కోసం చూస్తున్న విక్టరీ వెంకటేష్ కలిసి ఓ సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించబోతున్నారు. ఇప్పుడు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందట.

Balakrishna and Ravi Teja Special Roles In Anil Ravipudi and Venkatesh Movie

త్వరలోనే మొదలెట్టేసి : విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే సినిమాకు అతి త్వరలోనే అధికారికంగా మొదలు పెట్టబోతున్నారని తెలిసింది. అంతేకాదు, వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసుకుని.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది.

ఆ ఇద్దరు హీరోలు కూడా : అనిల్ రావిపూడి సినిమాలు అంటేనే ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. అతడి మొదటి చిత్రం నుంచి దీన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఇక, ఇప్పుడు విక్టరీ వెంకటేష్‌తో తెరకెక్కించబోతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడట. దీనికి కారణం ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ, రవితేజ కూడా నటిస్తుండడమే అని తాజాగా న్యూస్ లీకైంది.

Balakrishna and Ravi Teja Special Roles In Anil Ravipudi and Venkatesh Movie

అదేగా అసలైన ట్విస్టు : విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీలో బాలయ్య, రవితేజ గెస్టు రోల్స్ మాత్రమే చేస్తున్నారట. వీళ్లిద్దరూ ఒకరి తర్వాత ఒకరు స్క్రీన్‌పై సందడి చేస్తారని తెలిసింది. ఇప్పటికే ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇందులో నటించేందుకు సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇదే వర్కౌట్ అయితే టాలీవుడ్‌లో సెన్సేషన్ అవుతుందని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X