బాలయ్యకి ఎన్టీఆర్ పై మళ్ళీ..?
ఎన్టీఆర్ నిమ్మకూరు వెళ్ళి రావటం,దానికి మీడియా విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వటం బాలకృష్ణకు కోపం, చిరాకు తెప్పించిందంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినపడుతోంది.ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఎన్టీఆర్ కి చంద్రబాబు, బాలయ్య ప్రయారిటీ ఇవ్వటం లేదని అంటున్నారు. అయితే ఇదీమీ పట్టించుకోకుండా ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలకు అతీతంగా తన తాతగారిపై భక్తితో అక్కడికి వెళ్ళటం అందరికీ నచ్చుతోందని అంటున్నారు. ఎలక్షన్స్ సమయంలోనూ ఎన్టీఆర్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని చంద్రబాబుపై కొంత కినుక వహించినా తప్పనిసరి పరిస్ధితుల్లో సర్ధుకుపోయిన నందమూరి వారసులు ఈ విషయంలో మాత్రం కాక మీద ఉన్నారని చెప్తున్నారు. నిజానికి వారికి ఎలా ఉన్నా వారి చుట్టుప్రక్కల వారు మాత్రం దీన్ని హైలెట్ చేస్తూ..ఎన్టీఆర్ ని నెగిటివ్ చేస్తున్నారని చెప్తున్నారు. తారకరత్న సైతం ఈ విషయాన్ని సీరియస్ గానే పరిగణిస్తున్నాడని, అప్పట్లో మామ బాబు పట్టించుకోక, ఇప్పుడు ఎన్టీఆర్ ఇలా నిమ్మకూరు వెళ్ళి తాము చేయని పనిని ఎత్తిచూపుతున్నట్లు ఫీలవుతున్నారని అంటున్నారు. మరో ప్రక్క ఎన్టీఆర్ వర్గం మాత్రం నందమూరి వంశం వారు మొదటి నుంచి ఇదే పద్దతిని అవలంబిస్తున్నారని, బాలకృష్ణ కూతురు పెళ్ళిలో ఏం జరిగిందో గుర్తు లేదా అంటున్నారు.


Click it and Unblock the Notifications











