»   » బిజినెస్ ప్లాన్?... బాలయ్యకు మహేష్ బాబు ఆహ్వానం!

బిజినెస్ ప్లాన్?... బాలయ్యకు మహేష్ బాబు ఆహ్వానం!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Balakrishna-Mahesh Babu
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు తను ప్రస్తుతం నటిస్తున్న '1-నేనొక్కడినే' చిత్రం ద్వారా సక్రాంతి రేసులో బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటుకోవాలనే ప్లాన్లో ఉన్న సంగతి తెలిసిందే. తన సినిమా బిజినెస్ పెంచుకోవడానికి మహేష్ బాబు సరికొత్త వ్యూహాలు అనుసరిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

త్వరలో జరుగనున్న '1-నేనొక్కడినే' ఆడియో వేడుక గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు తెలుగు సినిమా రంగంలోని ప్రముఖులతో పాటు....నందమూరి నటసింహం బాలకృష్ణను కూడా ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఇదంతా సినిమా బిజినెస్ పెంచుకోవడంలో భాగమే అని, మహేష్ బాబు సినిమాపై బాలయ్య ఫ్యాన్స్‌లోనూ ఆసక్తి పెంచేందుకే ఇదంతా అని అంటున్నారు.

'1-నేనొక్కడినే' నిర్మిస్తున్న 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ....బాలయ్యతో 'లెజెండ్' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్యకు ముఖ్య అథితిగా ఆహ్వానందం అందిందని, మహేష్ బాబు సినిమా ఆడియో వేడుకలో బాలయ్యను హైలెట్ చేయడం ద్వారా రెండు సినిమాల మార్కెట్ పెంచుకోవచ్చనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారని స్పష్టమవుతోంది.

'1-నేనొక్కడినే' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు ముందే చేస్తున్న బిజినెస్ చూస్తుంటే.....పవన్ కళ్యాణ్ రికార్డులను అందుకోవడం సాధ్యమే అనే అభిప్రాయం కలుగుతోంది. అందుకోసం గాను ఆ చిత్ర నిర్మాతలు ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు సాగుతున్నారు. ముందస్తుగా అత్యధిక సంఖ్యలో థియేటర్లను బుక్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఇప్పటికే '1' చిత్రం పలు ఏరియాల్లో థియేట్రికల్ రైట్స్ విషయంలో 'అత్తారింటికి దారేది' చిత్రానికి ఏమాత్రం తీసిపోకుండా బిజినెస్ చేస్తోంది. నెల్లూరు ఏరియాలో ఇప్పటికే '1' మూవీ ప్రీ రిలీజ్ బిజినెన్ 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని క్రాస్ చేసింది. ఈ లెక్కలు సినీ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇక తెలుగు సినిమాకు ముఖ్యమైన రాబడి కేంద్రంగా మారిన ఓవర్సీస్ ఏరియాలో మహేష్ బాబు సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ ఏరియాలో కూడా '1' చిత్రాన్ని భారీగా 200 స్క్రీన్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మహేష్ బాబు.....అంచనాలను ఏమేరకు అందుకుంటాడు అనేది త్వరలోనే తేలనుంది.

English summary
Film Nagar buzz is that Nandamuri Balakrishna will be the special guest for Mahesh's ‘1-Nenokkadine’ audio release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu