వైవియస్ చౌదరి సినిమాలో 'సీఎం'గా బాలకృష్ణ
బాలకృష్ణ, వైవియస్ చౌదరి కాంబినేషన్ లో గతంలో ఒక్క మగాడు చిత్రం వచ్చి డిజాస్టర్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. అయితే ఈ సారి వైవియస్ చౌదరి కేవలం నిర్మాతగానే ఉంటారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం టైటిల్ సిఎం(కామన్ మ్యాన్). ఈ చిత్రం సామాజిక సందేశంతో కలిసిన కమర్షియల్ వెంచర్ అని చెప్తున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 28న ఓపెన్ అవనుంది.
ఈ చిత్రానికి సంభందించి ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. బాలకృష్ణ రాజకీయాల్లో యాక్టివ్ గా తిరుగుతున్న నేపధ్యంలో ఈ టైటిల్ కి మంచి స్పందన వస్తుందని చెప్తున్నారు. ఇక బాలకృష్ణ తాజా చిత్రం అధినాయకుడు త్వరలో విడుదల కానుంది. మూడు గెటప్స్ లో బాలకృష్ణ ఈ చిత్రంలో కనపించనున్నారు. పరుచూరి మురళి దర్సకత్వంలో రూపొందే ఈ చిత్రం నేటి రాజకీయాల నేపధ్యంలో నడవనుందని చెప్తున్నారు. అలాగే వైవియస్ చౌదరి నిర్మిస్తున్న నిప్పు చిత్రం త్వరలో విడుదల అవుతుంది.


Click it and Unblock the Notifications











