అల్లు అర్జున్ చిత్రంలో గెస్ట్ గా బాలకృష్ణ నిజమేనా?
అల్లు అర్జున్, వివి వినాయిక్ కాంబినేషన్లో రూపొందనున్న బద్రీనాధ్ చిత్రంలో గెస్ట్ గా బాలకృష్ణ నటించనున్నారనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇప్పటివరకూ బాలకృష్ణ గెస్ట్ రోల్ చేయలేదని తొలిసారిగా చేస్తే కనుక మంచి క్రేజ్ ఏర్పడుతుందని అంటున్నారు. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఈ పాత్ర కోసం వినాయిక్ సంప్రదించటం జరిగిందని అయితే బాలకృష్ణ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్తున్నారు. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ చిత్రానికి కథను చిన్ని కృష్ణ అందిస్తున్నారు. చిన్ని కృష్ణ గతంలో బాలకృష్ణకి నరసింహ నాయుడు కథ అందించారు. అయితే బాలకృష్ణ చేయకపోతే తమిళం నుంచి ఆ పాత్రకు సరిపోయే నటుడుని తేవాలని వినాయిక్ ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం బాలకృష్ణ పూర్తిగా సింహా ప్రమేషన్ హడావిడిలో ఉన్నారు. ఆ చిత్రం రిలీజ్ అయ్యేవరకూ వేరే కమిట్ మెంట్స్ కానని వినాయిక్ కి చెప్పారని వినపడుతోంది. వివి వినాయిక్, బాలకృష్ణ కాంబినేషన్లో గతంలో చెన్న కేశవ రెడ్డి చిత్రం వచ్చింది. ఇక ఈ వార్త రూమర్ కాకుండా నిజంగా జరిగితే ప్రాజెక్టు మంచి క్రేజ్ తెచ్చుకుంటుందనటంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











