'పరమవీర చక్ర' లో బాలకృష్ణ క్యారెక్టర్ కు సెంటిమెంట్ గా....
బాలకృష్ణ, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో రూపొందుతున్న "పరమవీర చక్ర" చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందలో బాలయ్య సైనికాధికారిగానూ, సిని నటుడుగానూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సైనికాధికారి పాత్రకు జయసింహ అనే పవర్ ఫుల్ పేరు ని పెట్టారు. బాలకృష్ణ సెంటిమెంట్ అయన సింహాను కలపటంతో సినిమా విజయావకాశాలు పెరుగుతాయని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో "రోబో" చిత్రం పేరడి పెడుతున్నారు. బ్రహ్మానందంపై ఈ పేరడీ ని క్రియేట్ చేస్తున్నారు. అలీ రోబో గానూ, సైంటిస్ట్ గా బ్రహ్మానందంను చేయనున్నారు. బాలకృష్ణ సరసన అమీషా పటేల్, షీలా, నేహా ధూఫియాల ముగ్గరూ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.
బాలకృష్ణ పరమవీర చక్ర షీలా అమీషా పటేల్ నేహా ధూపియా రోబో balakrishna paramaveera chakra sheela amisha patel neha dhupia dasari narayana rao


Click it and Unblock the Notifications