‘జమీందార్ నరసింహ రాయుడు’గా బాలయ్య

By Bojja Kumar

మనోజ్‌, దీక్షాసేథ్‌ జంటగా మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'. శేఖర్‌రాజా దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ సమర్పణలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో నందమూరి హీరో బాలకృష్ణ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య సరసన పాంచిబోరా నటిస్తోంది. శ్రీరామ రాజ్యం సినిమా విడుదల రోజున అంతర్వేదిలో జరుగుతున్న ఈ సినిమా షూటింగులోకి ఎంటర్ అయ్యారు బాలయ్య. నాలుగురోజుల పాటు ఈ చిత్రం షూటింగ్‌ అంతర్వేదిలో జరుగనుంది.

అయితే బాలయ్య ఈ సినిమాలో ఏం పాత్ర పోషిస్తున్నారనే విషయమై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం బాలయ్య ఇందులో 'జమిందార్ నరసింహ రాయడు"పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య ఇమేజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ పాత్రను రూపొందించారని, సినిమాకు బాలయ్యే ప్రధాన ఆకర్షణ అని సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. 2012 ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా సోనూసూద్‌, ప్రభు, రిషి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్‌, సంగీతం: బోబో శశి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X