twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శ్రీరామ రాజ్యం'లో బాలకృష్ణ మరో పాత్ర

    By Srikanya
    |

    'శ్రీరామ రాజ్యం'చిత్రంలో బాలకృష్ణ శ్రీరామడుగా కనపించనున్న సంగతి తెలిసిందే.అయితే తాజా సమచారం ప్రకారం ఆ చిత్రంలో బాలకృష్ణ రావణుడుగానూ కనపించనున్నాడని తెలుస్తోంది.సెకండాఫ్ లో వచ్చే చిన్న ఎపిసోడ్ లో కొన్ని నిముషాల సేపు బాలకృష్ణ రాముడుగా కనపిస్తాడని చెప్పుతున్నారు.అందులోనూ అంతకుముందే పరమవీర చక్ర సినిమా ప్రారంభంలో రావణుగా డైలాగులు చెప్పి బాలకృష్ణ అలరించారు.ఇక వారం క్రితం విడుదలైన శ్రీరామరాజ్యం ఆడియో మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

    గతంలో రామారావు గారు నటించిన లవకుశ కళాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కించారు. శ్రీరాముని జననం నుంచి రావణాసుర సంహారం వరకూ పదినిషాల పాటలో ఆ కథంతా ఉంటుంది. ఇప్పటికీ భారతావని అంతా రామరాజ్యం రావాలి అంటూ అనుకుంటూ ఉంటుంది. ఆ రామరాజ్యం ఎలా ఉండేది. రాముని విశిష్టత ఏమిటి.. అన్న విశేషమే శ్రీరామ రాజ్యం అని నిర్మాతలు చెప్తున్నారు.

    ఈ చిత్రంలో శ్రీరామునిగా బాలకృష్ణ, సీతగా నయనతార చేస్తున్నారు. శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీరాముడు రాజుగా పాలించిన ఘట్టమే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. ఈ చిత్రానికి పాటలు: జొన్నవిత్తుల, వెన్నెలకంటి, సినిమాటోగ్రఫీ:పి.ఆర్.కె. రాజు, కూర్పు: జి.జి. కృష్ణారావు, కళ: రవీంద్ర, గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్, డాన్స్: శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ, స్క్రీన్‌ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ.

    English summary
    Nandamuri Balakrishna would be essaying the role of Ravana in ‘Sri Rama Rajyam’. It is heard that this will come during the second half.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X