ఒకే పాత్రలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ
పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో పవన్ కళ్యాణ్ రిపోర్టర్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలకృష్ణ కూడా తన తాజా చిత్రం 'శ్రీమన్నారాయణ'లో రిపోర్టర్ గా కనిపిస్తాడని విశ్వసనీయ సమాచారం. ఈ నెల 13 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ చిత్రాన్ని రవిచావలి డైరక్ట్ చేస్తున్నారు. ఎల్లో ఫ్లవర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే లాంఛనంగా మొదలైంది.
పార్వతి మెల్టన్, ఇషా చావ్లా కథానాయికలు. 'సింహా'లో బాలకృష్ణ పోషించిన అధ్యాపక పాత్ర పేరు... శ్రీమన్నారాయణ కావడం గమనార్హం. గతంలో జగపతిబాబు ని సామాన్యుడు చిత్రంలో రిపోర్టర్ గా చూపించిన రవి చావలి ఈ సారి బాలయ్యను ఈ రకంగా చూపించి హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఇక 'శ్రీమన్నారాయణ' టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని,బాలకృష్ణ కెరీర్ లో మరో సూపర్ హిట్ గా మిగిలిపోతుందని నిర్మాతలు చెప్తున్నారు. ఇక బాలకృష్ణ తన మరో చిత్రం అధినాయకుడు విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











