పూరీ జగన్నాధ్ కి బాలకృష్ణ కండీషన్...
మే ఇరవైన బాలకృష్ణ, పూరీ జగన్నాధ్ చిత్రం మొదలుకావల్సింది..కాలేదు. కారణం బాలకృష్ణేనని తెలుస్తోంది. బాలకృష్ణ..పూరీ జగన్ చెప్పిన రెండు స్టోరీ లైన్స్ విని పెదివి విరిచారు. స్క్రిప్టు..సీన్ బై సీన్ డైలాగులతో సహా వినిపించాలి..అంతేగాని స్టోరీ లైన్ చెప్పద్దాని చెప్పారుట. అలాగే మాస్ ఆడియన్స్ కి నచ్చేలా కుటుంబ నేఫద్యం ఉన్న కథను మాత్రమే చెప్పమని ఆదేశించారుట., అంతేగాక యాక్షన్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ కలగలపి ఉండాలని వాటిని కూడా స్క్రిప్టు నేరేట్ చేసేటప్పుడు వివరించాలని కండిషన్ పెట్టారుట. సింహాకు అలా చేయబట్టే ఆ రేంజి సక్సెస్ సాధించానని ఆయన ఫీలవుతున్నారు.
ఇంతకాలం పూరీ జగన్నాధ్ తన హీరోలకు కట్టె కొట్టే తెచ్చే అన్నట్లుగా స్టోరీలైన్ చెప్పి లాగించేస్తూండేవారు. అదృష్టం బావుంటే అది పోకిరీలా సెన్సేషన్ సృష్టించే కథ కావచ్చు..లేదా మొదటి రోజే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఏక్ నిరంజన్ అయిపోవచ్చు. ఇక పూరీ కూడా వరసగా ప్లాప్ లు ఇస్తూండటం కూడా బాలకృష్ణ అతి జాగ్రత్తకు కారణం అంటున్నారు. అలాగే దాసరి నారాయణరావు లాంటి సీనియర్ దర్శకుడుకి సైతం కథ పూర్తయ్యాకే సినిమా ప్రారంభిద్దామని కండీషన్ పెట్టారని చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తూంటే బాలకృష్ణ తన సింహా విజయాన్ని కంటిన్యూ చేసేటట్లు ఉన్నారని అభిమానులు సంబరపడుతున్నారు.


Click it and Unblock the Notifications











