పార్వతిని అందాల షేపులు పెంచుకోమన్న బాలయ్య!
స్టార్ హీరోలు ఒక సినిమా ఒప్పుకున్నారంటే ముందుగా వారు దృష్టి పెట్టేది హీరోయిన్ పైనే. తమతో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేసే భామల ఎంపిక సరిగా లేక పోతే సినిమా విజయంపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో హీరోయిన్ల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తాజాగా బాలయ్య కూడా హీరోయిన్ల విషయంలో ఇలాంటివి చాలా పాటిస్తున్నాడు. శ్రీరామ రాజ్యం సినిమాలో నయనతారను ఏరి కోరి ఎంపిక చేసుకుని సక్సెస్ సాధించిన బాలయ్య తాజాగా 'శ్రీమన్నారాయణ' చిత్రంలో పార్వతి మెల్టన్ ను ఎంపిక చేశాడు. రవి చావలి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు.
తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం...జీరో సైజు మోజులో పడి బాగా బక్కి చిక్కిన పార్వతి మెల్టన్‌ను బరుపు పెంచుకోవాలని, అప్పుడే నీ అందాలు అందంగా, సరైన షేపుల్లో కనిపిస్తాయి, నా పక్కన హీరోయిన్ గా చేయాలంటే నిండుగా నిగనిగలాడుతూ ఉండాలి, లేకుంటే అభిమానులు ఇష్ట పడరు అని పార్వతికి బాలయ్య సూచించిడాని తెలుస్తోంది. బాలయ్య సూచన మేరకు ఇంత కాలం కష్ట పడి డైటింగ్ చేసి ఒళ్లు తగ్గించిన పార్వతి మళ్లీ బరుపు పెరిగేందుకు ప్రత్యేకమైన డైట్ తీసుకుంటోందట.


Click it and Unblock the Notifications











