అరవింద సమేత.. అబ్బాయ్ ఆడియో లాంచ్‌కు బాబాయ్ ?
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. తండ్రి మరణంతో ఎన్టీఆర్ తీవ్ర విషాదంలో ఉన్నాడు. అంతటి విషాదాన్ని కూడా దిగమింగి ఎన్టీఆర్ ఏ చిత్రం షూటింగ్ కు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. సినిమాని అనుకున్న టైంకు పూర్తి చేయడానికి, నిర్మాతకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబ సభ్యులంతా షాక్ లో ఉన్నారు. కష్ట సమయంలో బాలయ్య అని దగ్గరుండి చూసుకున్నారు. తన సోదరుడి అంత్యక్రియల కార్యక్రమంలో బాలయ్య అన్ని దగ్గరుండి జరిపించారు.

అబ్బాయిలకు చేరువగా
తండ్రి మరణించిన దుఃఖంలో ఉన్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు బాలయ్య చేరువయ్యాడు.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో ఆప్యాయంగా మాట్లాడుతూ వారితో కలసి భోజనం చేస్తున్న బాలయ్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బలపడిన బంధం
హరికృష్ణ మరణంతో జరిగిన విషాదం ఎలాగు పూడ్చలేనిది. దీని ద్వారా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్.. బాలయ్య మధ్య బంధం బలపడిందని అంటున్నారు. నెట్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోనే అందుకు ఉదాహరణ.

అరవింద సమేత
ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత చిత్రం మేజర్ షూటింగ్ పూర్తయింది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ లోనే అరవింద సమేత ఆడియో వేడుక జరగనుంది.

ముఖ్య అతిథిగా
ఈ ఆడియో వేడుకకు బాలయ్య చీఫ్ గెస్ట్ గా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇది కనుక జరిగితే నందమూరి అభిమానులకు పండగే. ఈ ఊహాగానాలతో వాస్తవం ఉందొ లేదో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాలి.


Click it and Unblock the Notifications











