బాలకృష్ణ సినిమా పూర్తిగా ఆగిపోయినట్లే
బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో బెల్లంకొండ సురేష్ ప్రారంబించిన హరహర మహాదేవ చిత్రం ఆగిపోయినట్లే అని విశ్వసనీయ సమాచారం. ప్రారంభం ఎప్పుడో జరిగినా ఈ చిత్రం స్క్రిప్టు పై చాలా కాలంగా కసరత్తలు జరుపుతున్నారు. రీసెంట్ గా బి గోపాల్ నేరేట్ చేసిన స్క్రిప్టుని విని బాలకృష్ణ పెదవి విరిచేసాడని వినికిడి. పరమ వీర చక్ర సినిమా ప్లాఫ్ నుంచి కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్న ఆ విషయంలో ఖచ్చితంగా ఉంటున్నారు. దాంతో ఇక ఈ సినిమా ఆగిపోయినట్లే అని తెలుస్తోంది. ఇక ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆ మధ్యన హైటెక్స్ లో జరిగింది.
అప్పుడు పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ 'ముహూర్తానికి 25 డైలాగులు రాసాము. అందులో ఓ డైలాగును ప్రారంభదృశ్యంలో బాలకృష్ణ గారు చెప్పారు. అది 'సై అంటే శరభ శరభ... జై అంటే ఆయుష్మాన్ భవ... కాదని ఎదురొస్తే హరహర మహాదేవ'. ఈ సినిమా చాలా పవర్ ఫుల్ డైలాగులతో వుంటుంది. అద్భుతమైన పాత్ర బాలయ్య చేస్తున్నాడు. ఏడు సంవత్సరాల తరువాత బాలయ్య సినిమాకు పనిచేస్తున్నాము. మంచి ఆకలితో ఉన్నాము. సినిమా కసిగా చేస్తున్నాము' అన్నారు. ఆ కసి అంతా ఏమై పోయిందో అని అంతా ఆశ్చర్యపోతున్నారు.


Click it and Unblock the Notifications











