షాకింగ్: ఆగిపోయిన బాలయ్య కొత్త సినిమా... సూపర్ స్టార్ మూవీలా ఉండడమే కారణం.!

By Manoj

నందమూరి బాలకృష్ణ... దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని, స్టార్ హీరోగా వెలుగొందుతున్న వ్యక్తి. ఎన్టీఆర్ నట వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.... అద్భుతమైన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే బాలయ్యకు.. కొత్త ప్రాజెక్టు విషయంలో తాజాగా భారీ షాక్ తగిలిందని ఓ న్యూస్ లీక్ అయింది. ఆ సంగతులేంటో మీరూ చూడండి.!

బాలయ్యకు వరుస ఎదురుదెబ్బలు

బాలయ్యకు వరుస ఎదురుదెబ్బలు

మొన్నటి వరకూ కొన్ని విజయాలను అందుకుని జోష్ మీద కనిపించాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. అయితే, గత ఏడాది ఆయనకు అంతగా కలిసి రాలేదు. 2019లో సినిమాల పరంగా ఈ నందమూరి హీరోకు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. పోయిన సంవత్సరం ఆయన మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా, అవన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి.

సక్సెస్‌ఫుల్ కాంబోలో మరో సినిమా

సక్సెస్‌ఫుల్ కాంబోలో మరో సినిమా

వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న నందమూరి బాలయ్య.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి.

హ్యాట్రిక్ కొట్టేందుకు.. ఎన్నో జాగ్రత్తలు

హ్యాట్రిక్ కొట్టేందుకు.. ఎన్నో జాగ్రత్తలు


గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా', ‘లెజెండ్' వంటి సూపర్ హిట్లు వచ్చాయి. దీంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల అంచనాలను అందుకునేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే హీరోయిన్‌ ఎంపిక, బాలయ్య రోల్స్, సినిమా టైటిల్ సహా అన్నింట్లో ప్రత్యేకతను చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది రాకముందే మరో దానిపై కన్ను

ఇది రాకముందే మరో దానిపై కన్ను

నందమూరి బాలకృష్ణ ఎంత స్పీడుగా సినిమాలు చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో ఆయన ట్రాక్ రికార్డ్ చూసిన వారికి ఈ విషయం అర్థం అవుతోంది. ఇక, ప్రస్తుతం ఆయన బోయపాటితో సినిమా షూటింగ్ చేస్తుండగానే... మరో ప్రాజెక్టును ఫైనల్ చేశారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే బాలయ్య.. బీ గోపాల్‌తో సినిమా చేస్తున్నారట.

ఆగిపోయిన బాలయ్య కొత్త సినిమా

ఆగిపోయిన బాలయ్య కొత్త సినిమా

గత ఏడాది వరుస పరాజయాల వల్ల ఢీలా పడిపోయిన నందమూరి అభిమానుల్లో జోష్ తీసుకొచ్చేందుకు బాలయ్య.. బీ గోపాల్‌తో మాస్ చిత్రాన్ని చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ మూవీకి సంబంధించిన కథ ఇదేనంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రకటనకు ముందే ఈ సినిమా ఆగిపోయిందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Recommended Video

Senior Telugu Actress Sanghavi With Her First Baby, Picture Goes Viral
ఆ మూవీ ఛాయలు ఉండడమే కారణం.!

ఆ మూవీ ఛాయలు ఉండడమే కారణం.!


బీ గోపాల్‌తో చేసే సినిమా ప్రకటన బాలయ్య పుట్టినరోజున ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోన్న తరుణంలో ఈ సినిమా ఆగిపోయిందని తెలిసింది. దీనికి కారణం... సాయి మాధవ్ బుర్రా రాసిన కథ.. రజినీకాంత్ నటించిన ‘దర్భార్' సినిమాను పోలి ఉండడమే అని సమాచారం. పాత కథతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకనే బాలయ్య ఈ సినిమాను ఆపేశారని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X