బాలకృష్ణను 'ఎలియన్'గా కామెడీ చేస్తున్నారు
బాలకృష్ణ తాజా చిత్రం 'అధినాయకుడు' మొన్న శుక్రవారం రిలీజై డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలకృష్ణ తాను ఎలియన్ అని, మార్స్ గ్రహం నుంచి వచ్చానని బ్రహ్మానందం తో చెప్పి కామెడీ చేస్తాడు. సినిమా భారీ విజయం సాధించకపోవడంతో ఇప్పుడదే కామిడీగా మారింది. చాలా మంది ఫేస్ బుక్ లలో, సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఎలియన్ ..బాలకృష్ణ అని, అధినాయకుడు..ఎ ఫిల్మ్ భై ఎలియన్.. ఫర్ ది ఎలియన్స్ అని కామెడీ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్ కు వ్యతిరేక వర్గం ఈ రకమైన కామెడీకి తెరతీసిందని చెప్పుతున్నారు.
అయితే నిజానికి చిత్రంలో బాలకృష్ణ,బ్రహ్మానందం మధ్య వచ్చే ఎపిసోడ్స్ మొత్తం కామెడీ గా ఉండి ధియోటర్స్ లో నవ్వులు పండించాయి. బాలకృష్ణను నిజంగానే మార్స్ నుంచి వచ్చిన ఎలియన్ అనుకుని బ్రహ్మానందం ప్రవర్తించే తీరు నవ్వులకు తెరతీసింది. సినిమా హైలెట్స్ లో అది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రంలోని బాలకృష్ణ ప్రొపెషినల్ కిల్లర్ గా కనిపించే బాబి పాత్ర కూడా నవ్వులు పాలైంది. బాలకృష్ణ ..ప్రొఫెషనల్ కిల్లర్ ఏమిటి అని విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోప్రక్క 'అధినాయకుడు'కలెక్షన్స్ అదరకొడుతున్నాయని నిర్మాత ఎమ్.ఎల్.కుమార చౌదరి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...'మండుటెండల్లో బాలయ్య కలెక్షన్ల కుంభవృష్టి' సృష్టిస్తున్నాడని అన్నారు.నందమూరి బాలకృష్ణ నటించిన 'అధినాయకుడు' చిత్రం భారీ కలెక్షన్లతో మొదలైందని చెప్పారు. శ్రీకీర్తి క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకుడు. లక్ష్మీ రాయ్,సలోని హీరోయిన్స్ గా చేసారు.
ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...'చాలా ఆనందంగా ఉంది. జూన్ 1న విడుదలైన సినిమా అద్భుతమైన కలెక్షన్ల రికార్డ్ సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి యు.ఎస్. వరకూ బాలయ్య సినిమా సూపర్‌డూపర్‌హిట్ అని టాక్ వచ్చింది. కథాపరంగా అన్ని హంగులు ఉండేట్టు దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు' అని అన్నాడు.
ఇందులో బాలయ్య పలికే డైలాగ్స్‌నుద్దేశించి ..ఓ పార్టీపై విమర్శలు వచ్చాయి. ఈ సినిమా చూశాక ఎవర్నీ ఉద్దేశించినవికావని అర్థమవుతుందని, సినిమాను అన్ని పార్టీలవారు చూడాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. 'మేం సినిమా తీసినప్పుడు ఎలక్షన్లు రాలేదు. విడుదల సమయంలో ఎలక్షన్లు వచ్చాయి. అందుకే ఈ సినిమా ఇంత హైప్ క్రియేట్ చేసింది' అని అన్నారు.


Click it and Unblock the Notifications











