బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ కాంబినేషన్ లో గతంలో లక్ష్మీ ప్రసన్న వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. అయితే కాల్పులు కేసు అనంతరం ఇద్దరు మధ్యా దూరం పెరుగుతూ వచ్చింది. అయితే ఇటీవల జరిగిన పరిణామాలుతో ఇద్దరూ మళ్ళీ దగ్గరయ్యారు. బెల్లంకొండ నిర్మించిన రైడ్ ఆడియోకు బాలయ్య ఛీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ నేపద్యంలో బాలకృష్ణతో బెల్లంకొండ మరో సినిమా చేయటానికి ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం. భిల్లా చిత్రం రూపొందించిన మెహర్ రమేష్ ని దర్శకుడుగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం వివరాలు జూన్ మూడున అఫీషియల్ గా ప్రకటించి బాలయ్య పుట్టినరోజైన సినిమా ప్రారంబించాలని సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం.