బాలకృష్ణ-బోయపాటి చిత్రం వాయిదా
అలాగే ఈ చిత్రానికి ఇప్పటివరకూ హీరోయిన్ ఫైనలైజ్ కాలేదని సమాచారం. ఛార్మి, త్రిష అంటూ చాలా పేర్లు తెరపైకి వచ్చినా అవేమీ మెటిరియలైజ్ కాలేదు. బాలకృష్ణ సరసన ఫెరఫెక్ట్ గా సూటయ్యే హీరోయిన్ కోసం దర్శకుడు సెర్చ్ చేస్తున్నారు.
వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ ఈచిత్రాన్ని ప్రొడక్షన్ నెం.4గా నిర్మిస్తోంది. హైదరాబాద్‌లోని 14రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కార్యాలయంలో పార్మల్ పూజా కార్యక్రమం జూన్ 3వ తేదీనే జరిగింది. బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 10న షూటింగ్ ప్రారంభమైంది.
ఈ చిత్రానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా గురించి దర్శకుడు ఇటీవల మాట్లాడుతూ.... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అంటున్నారు బోయపాటి.


Click it and Unblock the Notifications












