బాలకృష్ణ-బోయపాటి చిత్రం టైటిల్ ఖరారు
ప్రస్తుతం బోయపాటి శ్రీను స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసి ఈ నెలాఖరునుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్లటానికి రెడీ అవుతన్నారు. ఇక మొదట ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఆ టైటిల్ వేరే బ్యానర్ లో రిజిస్టర్ చేసి ఉండటంతో ఈ టైటిల్ తో ముందుకెళ్తున్నట్లు చెప్తున్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అన్నారు.
అలాగే బాలకృష్ణ నుంచి ప్రేక్షకులు, అభిమానులూ ఏం కోరుకొంటారో అవన్నీ మేళవిస్తూ.. ఆయన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. రాజకీయ అంశాలూ ఉంటాయా? అని అందరూ అడుగుతున్నారు. అవీ ఉంటాయి. కానీ.. కథకు ఎంత వరకూ అవసరమో అంతే. ఆ గీత దాటి బయటకు వెళ్లవు అన్నారు.
ఇక బాలకృష్ణగార్ని దృష్టిలో పెట్టుకొని చేసిన కథ ఇది. ఏ సినిమాకైనా టిక్కెట్ తెగేది హీరోని చూసే. 50, 60 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే అది హీరోని చూసే. అందుకే నా సినిమాల్లో హీరోని వేరే ఏ ఇతర పాత్రలూ డామినేట్ చేయనివ్వను. నా సినిమాల్లో నా హీరోనే హైలైట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను. నేను ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి అభిమానిని అని భావిస్తా. అప్పుడే ఓ అభిమాని ఆ హీరో నుంచి ఏమేం ఎదురు చూస్తున్నాడో అవన్నీ చేయగలుగుతా అని చెప్పారు.


Click it and Unblock the Notifications












