బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాకు ముహూర్తం కుదిరింది!
Recommended Video

సినీ ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి క్రేజీ కాంబినేషన్లలో నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన.. సింహా , లెజెండ్ సినిమాలు బాక్స్ఆఫీస్ దగ్గర పెద్ద విజయాలు సాధించాయి.
తాజా సమాచారం మేరకు బాలయ్య, బోయపాటి సినిమా జూన్ 10న ప్రారంభం కానుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. బాలకృష్ణ లో కొత్త కోణాన్ని చూపించిన దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణతో సినిమా చేయడానికి తానెప్పుడూ సిద్ధమే పలుసార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే జనాల్లోనే కాదు.. ట్రేడ్ వర్గాల్లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకుంది. రాబోయే ఎన్నికల లోపు సినిమాను విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జూన్ లో ప్రారంభం చేసి దసరా నాటికి షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఎలక్షన్స్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని బాలయ్య అనుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











