»   » తూచ్...బాలకృష్ణ సినిమా టైటిల్ అది కాదు

తూచ్...బాలకృష్ణ సినిమా టైటిల్ అది కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ తాజా చిత్రానికి రోజుకో టైటిల్ ప్రచారంలోకి వస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రానికి టైటిల్ ఇప్పటివరకూ ప్రకటించకపోవటంతో ఎవరికి తోచిన టైటిల్ ని వారు అనుకుని సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ద్వారా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇంతుకు ముందు జయసింహ అనే టైటిల్ అనుకున్నా ఇప్పుడు ఆ టైటిల్ కాదు సామ్రాట్ అనే టైటిల్ అంటూ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు అదీ కాదని తేలింది. ఆల్రెడీ సామ్రాట్ టైటిల్ ని బాలకృష్ణ మిత్రుడు శివలెంక కృష్ణ ప్రసాద్ రిజిస్టర్ చేసారు.

4రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై 'దూకుడు' లాంటి బ్లాక్‌బస్టర్‌ని ప్రేక్షకులకు అందించిన నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. బాలకృష్ణకున్నపవర్ ఫుల్ మాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాతలు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలయ్య రాజకీయ జీవితానికి బలమైన పునాది వేసేలా ఈ సినిమా ఉండబోతుందని మీడియా వర్గాల సమాచారం.

అభిమానులు అంచనాలకు తగ్గట్టుగానే బోయపాటి శక్తిమంతంగా బాలయ్య పాత్రను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. జగపతిబాబు ఇందులో విలన్ పాత్ర పోషించడం విశేషం. ఆయనకు జంటగా ఇందులో కల్యాణి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ నానక్‌రామ్‌గూడా రామానాయుడు సినీ విలేజ్‌లో జరుగుతోంది.

బాలకృష్ణ, జగపతిబాబు, కల్యాణిలపై కీలక సన్నివేశాలను బోయపాటి చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి 'సామ్రాట్' అనే టైటిల్ నిర్ణయించినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే... అందులో ఏ మాత్రం నిజం లేదనేది విశ్వసనీయ సమాచారం. త్వరలోనే టైటిల్‌ని నిర్ణయిస్తారట. సోనాలీ చౌహాన్ సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది.

English summary
Nandamuri Balakrishna-Boyapati Sreenu combo movie somehow managed to overcome the teething problems like finding suitable heroines for Balayya, title issue etc. Amrita rao and Sonal Chowhan are playing female leads opposite Balayya in this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu