Just In
- 35 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బోయపాటి - బాలయ్య సినిమా కథ లీక్: మొత్తం ఆ తొమ్మిదింటి చుట్టే తిరుగుతుందట.!
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లిద్దరి కలయిలో గతంలో వచ్చిన సినిమాల ఫలితాలే దీనికి నిదర్శనం. అందుకే ఈ కాంబోలో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో అంశాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా కథ లీక్ అయింది. ఆ వివరాలేంటో చూద్దాం.

బాలయ్యకు భారీ పరాభవం.. నష్టాలు కూడా
నందమూరి బాలకృష్ణ గత ఏడాది దారుణంగా విఫలమయ్యారు. 2019లో ఆయన నటించిన మూడు చిత్రాలు (యన్.టి.ఆర్ బయోపిక్ రెండు భాగాలతో పాటు రూలర్) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మూడు సినిమాలూ బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. అంతేకాదు, తన తండ్రి బయోపిక్‌కు నిర్మాతగానూ వ్యవహరించిన ఆయనకు నష్టాలు కూడా వచ్చాయి.

హ్యాట్రిక్ చేయడానికి రెడీ అవుతున్న జంట
‘సింహా', ‘లెజెండ్' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత బాలయ్య - బోయపాటి శ్రీను కాంబోలో సినిమా రాబోతుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. ఎందుకో కార్యరూపం దాల్చలేదు. దీనిని పక్కన పెట్టేసిన బాలయ్య.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్' చేశాడు. ఇక, త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ మొదలు కాబోతుంది.

ఆ సినిమా ఎఫెక్ట్.. కథలో మార్పులు షురూ
గత ఏడాది చివర్లో నందమూరి బాలయ్య నటించిన ‘రూలర్' సినిమా విడుదలైంది. ఇది ఘోర పరాజయాన్ని చవి చూసింది. దీంతో బోయపాటి తెరకెక్కించే సినిమా స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. దీనికితోడు, మేకింగ్ విషయంలోనూ బోయపాటి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయ్యాడని అంటున్నారు.

వాళ్ల విషయంలో నో క్లారిటీ.. రూమర్లకు నో బ్రేక్
ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. బాలయ్య సరసన నటించే హీరోయిన్ ఫిక్స్ అయిందంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ.. ఇప్పటికీ ఎవరూ ఫైనల్ కాలేదు. అలాగే, మిగిలిన నటీనటుల ఎంపిక విషయంలోనూ ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. దీంతో ఈ సినిమా తరచూ వార్తల్లోకి వస్తోంది.

బోయపాటి - బాలయ్య సినిమా కథ లీక్
తాజాగా ఈ సినిమా కథ గురించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమా కథ లీక్ మొత్తం నవగ్రహాలు.. అవి మనుషులపై చూపించే ప్రభావం అనే లైన్‌తో తెరకెక్కబోతుందట. ఇందులో భాగంగానే బాలయ్య.. వారణాసిలో కనిపించే అఘోరాగా నటిస్తున్నాడని సమాచారం. ఆ లుక్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది.