twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య సొంతగా ఫిల్మ్ స్టూడియో, అమరావతిలో ప్రయత్నాలు....?

    By Bojja Kumar
    |

    Recommended Video

    ఫిల్మ్ స్టూడియో ప్లాన్ చేస్తున్న బాలయ్య.. ఎక్కడో తెలుసా ?

    ఇప్పటి వరకు నటుడిగా మాత్రమే కొనసాగిన నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ద్వారా నిర్మాతగా మారబోతున్నారు. అంతే కాదు త్వరలో ఆయన ఏపీ కొత్త రాజధాని అమరావతిలో సొంతగా ఫిల్మ్ స్టూడియో నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయని అంటున్నారు.

    బాలయ్య ఫ్యూచర్ ప్లాన్స్

    బాలయ్య ఫ్యూచర్ ప్లాన్స్

    ప్రస్తుతం బాలయ్య సినిమా కెరీర్ వరుస విజయాలతో సూపర్బ్ గా సాగుతోంది. త్వరలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో తమకంటూ సొంతగా ఓ నిర్మాణ సంస్థ, ఫిల్మ్ స్టూడియో ఉంటే ఇండస్ట్రీపై మరింత పట్టుసాధించవచ్చనే అభిప్రాయంలో బాలయ్య ఉన్నట్లు సమాచారం.

     సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నుండి షిప్ట్ అవ్వాలనే డిమాండుపై

    సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నుండి షిప్ట్ అవ్వాలనే డిమాండుపై

    సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నుండి అమరావతి షిప్ట్ అవ్వాలనే వాదనతో మాత్రం బాలయ్య ఏకీభవించడం లేదు. రెండు రాష్ట్రాల్లో ఉండేది తెలుగు ప్రజలే, అందరూ చూసేది తెలుగు సినిమాలే, సినిమా పరిశ్రమ షిప్ట్ అవ్వాల్సిన అసవరం లేదని బాలయ్య అభిప్రాయ పడుతున్నారు.

     చెన్నై నుండి హైదరాబాద్ రావడానికి ఓ కారణం ఉంది

    చెన్నై నుండి హైదరాబాద్ రావడానికి ఓ కారణం ఉంది

    అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ రావడానికి బలమైన కారణం ఉంది. అపుడు రీజనల్ ఫీలింగ్, లాంగ్వేజ్ ఫీలింగ్ వల్లే ఇండస్ట్రీ షిప్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. ప్రస్తుతం లాంటి అవసరం లేదని బాలయ్య అభిప్రాయ పడుతున్నారు.

     బాలయ్య పర్సనల్ ఛాయిస్

    బాలయ్య పర్సనల్ ఛాయిస్

    ఏపీలో ఫిల్మ్ స్టూడియోలు నిర్మించడానికి అనుకూలమైన వాతావరణం, అందమైన లొకేషన్లు ఉన్నాయి. అక్కడ ఎవరైనా స్టూడియోలు నిర్మించాలనుకోవడం వ్యక్తిగత నిర్ణయం అని బాలకృష్ణ అభిప్రాయ పడ్డట్లు సమాచారం.

    ఆల్రెడీ విశాఖలో స్టూడియోలు

    ఆల్రెడీ విశాఖలో స్టూడియోలు

    ఇప్పటికే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ వారు విశాఖలో కూడా ఓ స్టూడియోను నిర్మించారు. ఇతర నిర్మాతలు కూడా ఏపీలో స్టూడియోలు నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. బాలయ్య కూడా స్టూడియో ప్లాన్ చేస్తుంటం.... భవిష్యత్తులో ఏపీలో కూడా సినిమా ఇండస్ట్రి హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    English summary
    Nandamuri Balakrishna is going to build his own film studio in the new state of Andhra Pradesh. He said he has plans to build his own film studio in AP. However, this may take sometime.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X