భారీ సంచలనాలకు బాలయ్య రెడీ..
'సింహా" తో తన స్టామినా ఏమిటో మరోసారి చూపిన నందమూరి యువరత్న బాలకృష్ణ, హీరోగా ఎన్నో సంవత్సరాలుగా పలు రకాల క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న బాలయ్య త్వరలో ఓ సినిమాకి డైరెక్షన్ చెయ్యబోతున్నారనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. గతంలో తన దర్శకత్వంలో 'నర్తనశాల" వంటి క్లాసిక్ ను ప్రారంభించారు బాలకృష్ణ. కాని బెల్లంకొండ సురేష్ పై కాల్పుల ఆరోపణలు బాలకృష్ణ ఎదుర్కొనడంతో ఆ సినిమాకి బ్రేక్ పడింది. మళ్ళీ ఇన్నాళ్ళకు డైరెక్షన్ చేసే ఆలోచనలో ఉన్నారట బాలయ్య. వచ్చిందే తడవుగా వేగంగా స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బాలకృష్ణ రూపొందించేది పౌరాణికమా లేక సాంఘికమా అనే విషయం తెలియాల్సి వుంది. ఇదే నిజమైతే బాలయ్య అభిమానులకు పండగే. అయితే హీరోగా ఎన్నో సంచలనాలు సృష్టించిన బాలకృష్ణ దర్శకుడుగా ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో వెయిట్ అండ్ సీ..
More from Filmibeat
బాలకృష్ణ సింహా బెల్లంకొండ సురేష్ పరమవీరచక్ర దాసరి నారాయణ రావు balakrishna simha bellamkonda suresh dasari narayana rao


Click it and Unblock the Notifications











