ముద్దు మైకం: ఆమెతో బాలయ్య మరోసారి!
హైదరాబాద్: శ్రీమన్నారాయణ చిత్రంలోని 'తకతై తకతై' సాంగులో హీరోయిన్ ఇషా చావ్లా బాలయ్యతో హాట్ హాట్‌గా ఆడి పాడిన విషయం తెలిసిందే. అందరికీ షాకిస్తూ బాలయ్య పెదాలపై ముద్దులు, ఆయన బుగ్గలు కొరికేస్తూ కసెక్కించింది. ఈ నేపథ్యంలో ఆమె మైకం నుంచి బాలయ్య ఇంకా తేరుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా వినిపిస్తున్న హాట్ గాసిప్ ఏమిటంటే....తన తర్వాతి సినిమా 'ఆదిత్య 999' చిత్రంలో ఇషా చావ్లాకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట బాలయ్య. శ్రీమన్నారాయణ చిత్రంలో ఇషాను తన కౌగిట్లో నలిపేసిన బాలయ్య ఆ సినిమాలో ఏ రేంజిలో రొమాన్స్ చేస్తాడో అని అభిమానులు చర్చించుకుంటున్నారు.
'ఆదిత్య 999' ఈ చిత్రానికి సింగితం శ్రీనివాస రావు దర్శకత్వం వహించనున్నారు. కొండ కృష్ణం రాజు సమర్పణలో వినోద్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక బాలయ్య నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రం బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపిస్తుంది. రవికుమార్ చావలి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని రమేష్ పుప్పాల 'ఎల్లో ఫ్లవర్స్' బేనర్ పై నిర్మించారు. పార్వతి మెల్టన్, ఇషా చావ్లా హీరోయిన్లు. చక్రి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











