దాసరి కి ‘పరమ’ స్ట్రిట్ గా షరత్తులు పెట్టిన బాలయ్య...!?
'సింహా" లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నటసింహా బాలకృష్ణ దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో చేస్తున్న 'పరమవీరచక్ర" విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సినిమాకి ఏమాత్రం హైప్ క్రియేట్ చెయ్యెుద్దని, లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చెయ్యాలని దర్శకనిర్మాతలకు సూచించినట్టు తెలుస్తోంది. 'ఒక్కమగాడు" చిత్రానికి బాగా పబ్లిసిటీ చేసి ఎక్కువ హైప్ తీసుకురావడం వల్ల సినిమాకి బాగా బ్యాడ్ జరిగిందని, మళ్ళీ అదే తప్పు చేయకూడదని బాలకృష్ణ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఎంతో అవసరమైతే తప్ప మీడియాకు 'పరమవీరచక్ర" సినిమాకి సంబంధించిన వివరాలు వెల్లడించవద్దని షరత్తులు పెట్టాడు. సైలెంట్ గానే వెళ్ళి మళ్ళీ పెద్ద హిట్ కొట్టాలన్నది బాలయ్య ఆలోచన. ఇప్పటికే ఈ సినిమా మీద చాలా ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. సినిమా బాగా వస్తోందని సినీవర్గాలకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య ఈ నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే మరోసారి తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











