ఆ సమయంలో కన్నీరు మున్నీరైన బాలకృష్ణ...!
యువరత్న బాలకృష్ణ సినిమాల్లో దుఖ:రసాన్ని పోషించటం అందరూ చూస్తుంటారు. కానీ నిజ జీవితంలో బాలకృష్ణ కన్నీరు కార్చారని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు. బాలకృష్ణ విడిగా ఎంతో ధైర్యం మొండిగా ఉంటాడని ఫిలిం పరిశ్రమకు తెలుసు. అయితే ప్రముఖ సినీ రైటర్, సాహిత్యవేత్త, ముళ్లపూడి వెంకటరమణ గురువారం(24.02.11)మరణించాడని వార్త వినగానే, బాలకృష్ణ ఎంతో ఎమోషనల్ గా ఫీలయ్యి, ఒక్కసారి మౌనముద్రలో మునిగిపోయి, కంటి వెంట కన్నీరు కార్చాడని బాలకృష్ణ సన్నిహితులు చెప్పారు. 'శ్రీరామ రాజ్యం" సినిమాకు ముళ్లపూడి గారు రైటర్ గా బాపు దర్శకుడిగా, బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో ముళ్ళపూడి వెంకటరమణ మరణం బాలకృష్ణను కలిచివేసిందని సినీ జనాలు అనుకుంటున్నారు.
బాలకృష్ణ ఎందుకో పౌరాణికాలు అచ్చిరావటం లేదని, గతంలో 'విరాటపర్వం" సినిమా మొదలు పెట్టినప్పుడు పాంచాలి పాత్రకు 'సౌందర్య"ను బుక్ చేశారు. ఆ తర్వాత సౌందర్య హెటికాప్టర్ ప్రమాదంలో మరణించడం వలన ఆ సినిమా ఆగిపోయింది. ఈ రోజు శ్రీ రామ రాజ్యం సినిమాకు రచన చేసిన ముళ్లపూడి గారు వెళ్లటం, బాలకృష్ణ సెంటిమెంటుగా ఫీలయ్యి బాధపడుతున్నాడని ఫిలింనగర్ న్యూస్..


Click it and Unblock the Notifications