బాలయ్య దైర్యానికి మెచ్చుకోలు కాబోలు...!
ఏ హీరో అయినా ఒక దర్శకుడి ట్రాక్ రికార్డ్ చూసి సినిమాలు ఒప్పుకుంటూ ఉంటాడు. మరీ కథ తెగ నచ్చితే తప్ప దర్శకుడి ట్రాక్ రికార్డ్ పరిగణలోకి రాకుండా పోదు. అయితే దీనికి విరుద్దంగా నందమూరి బాలకృష్ణ మాత్రం ట్రాక్ రికార్డ్ ని పట్టించుకోకుండా వరుసగా సినిమాలు ఒప్పేసుకుంటున్నారు. ఒకప్పుడు ఉద్దండ దర్శకులే అయినా ఇటీవలి కాలంలో ట్రెండు ని అందుకోలేక తిప్పలు పడుతున్న దాసరి నారాయణరావుతో 'పరమవీరచక్ర", బాపుతో 'శ్రీరామరాజ్యం" సినిమాలు చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఫామ్ తో తంటాలు పడుతున్న పరుచూరి మురళి దర్శకత్వంలోనూ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఇది చాలదన్నట్టు తనతో చేసిన లాస్ట్ సినిమాలతో తిరుగులేని ప్లాప్ లిచ్చిన గోపాల్, జయంత్ కీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'పలనాటి బ్రహ్మనాయుడు" వంటి డిజాస్టర్ ఇచ్చిన బి. గోపాల్ తో ఒక చిత్రం, 'అల్లరి పిడుగు" అంటూ తన నెత్తిన పిడుగు పడేసిన జయంత్ డైరెక్షన్ లో మరో చిత్రం చేయడానికి బాలకష్ణ రెడీ అవుతున్నారు. ఒకేసారి ఇంతమంది ప్లాప్ డైరెక్టర్లతో సినిమా చేయాలని ఎంతో గుండె దైర్యం కావాలి. బాలయ్యకి అది మస్తుగా ఉందని ఇంకోసారి ప్రూవ్ అయింది. మరి బాలయ్య దైర్యానికి మెచ్చుకోలు కాబోలు...బాలయ్యనా మజాకానా అంటున్నారు తన ఫ్యాన్స్..


Click it and Unblock the Notifications











