దాసరి, బాలకృష్ణ కాంబినేషన్ చిత్రం లేటెస్ట్ ఇన్ఫో
దర్శకరత్న దాసరి 150 చిత్రం బాలకృష్ణతో చేయనున్నారనే సంగతి తెలిసిందే. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఆయన బొబ్బిలి పులి రీమేక్ నే ఈ కాలానికి తగినట్లు మార్చి బాలయ్యతో చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సారి టైటిల్..పరమ వీర చక్ర అని పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేసారు. ఇక ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. దాసరి సంస్ధ కొంత మేరకు ఫైనాన్స్ చేస్తుందని అంటున్నారు. అలాగే బొబ్బిలి పులి చిత్రంలో పాపులర్ అయిన జననీ జన్మభూమి అనే టైటిల్ సాంగ్ ని అదే ట్రాక్స్ తో కొద్దిగా సాహిత్యం మార్చి అందించనున్నారు. దాసరి ప్రస్తుతం చేస్తున్న యంగ్ ఇండియా రిలీజ్ అనంతరం ఈ ప్రాజెక్టు మీద వర్క్ చేస్తారని వినపడుతోంది. ఇక ఈ నెల 30వ తేదీన బాలకృష్ణ నటించిన సింహా చిత్రం రిలీజ్ అవుతోంది.
More from Filmibeat
దాసరి నారాయణ రావు బాలకృష్ణ సింహా యంగ్ ఇండియా నయనతార నమిత స్నేహ ఉల్లాల్ పరమ వీర చక్ర simha young india dasari narayana rao param veera chakra balakrishna


Click it and Unblock the Notifications











