ఇంట్రెస్టింగ్: బాలయ్యతో దిల్ రాజు సినిమా ఫిక్స్.. రీమేక్ కోసం అదిరిపోయే టైటిల్.!
Recommended Video
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు.. నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఇందుకోసం ఆయనకు కొన్ని స్క్రిప్టులు కూడా పంపించారు. ఎందుకో మరి వీరి సినిమా మాత్రం వర్కౌట్ కాలేదు. అయితే, నందమూరి బాలకృష్ణ - దిల్ రాజు కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ ఇద్దరి అడుగులు పడుతున్నాయని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

‘పింక్’ రీమేక్ హక్కులు
బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ - తాప్సీ పన్ను కలయికలో వచ్చిన చిత్రం ‘పింక్'. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ‘పింక్' తెలుగు రీమేక్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందుకోసం ఆయన భారీ మొత్తాన్నే చెల్లించారని కూడా ప్రచారం జరుగుతోంది.

బాలయ్య గ్రీన్ సిగ్నల్
బాలయ్యతో ఎప్పటి నుంచో సినిమా చేయాలని భావిస్తున్నారు దిల్ రాజు. ఇందులో భాగంగానే ఆయనను దృష్టిలో ఉంచుకుని ‘పింక్' తెలుగు రీమేక్ హక్కులు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విషయమై ఆయన.. బాలయ్యతో చర్చలు కూడా జరిపారని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. దీనికి బాలయ్య నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని టాక్.

అదరిపోయే టైటిల్
‘పింక్' అనే పేరుతో బాలీవుడ్‌లో వచ్చిన సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు హక్కులను తీసుకున్న వెంటనే, దీని కోసం దిల్ రాజు ఓ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారనే టాక్ వినిపిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు ‘లాయర్ సాబ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారట.

తమిళంలో అజిత్
‘పింక్' సినిమా యూనివర్శల్ సబ్జెక్టుతో తెరకెక్కింది. కాబట్టి దీన్ని తమ తమ భాషల్లో రీమేక్ చేసుకోడానికి ఫిల్మ్ మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళంలో అజిత్ హీరోగా ‘నెర్కొండ పార్వాయి' పేరుతో ఈ సినిమా రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇది ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలయ్య బిజీ
ప్రస్తుతం బాలకృష్ణ - కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్ర షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. సీ కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఈ సినిమాలో సీనియర్ హీరోయిన భూమిక కూడా కీలక పాత్ర పోషిస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











