బోయపాటి చిత్రంలో బాలకృష్ణ పాత్రలు ఇవే

By Srikanya

హైదరాబాద్ : బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారా...అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఆయన తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి అలరించనున్నారని తెలుస్తోంది. అవీ తండ్రీ కొడుకులు పాత్రలు అని చెప్తున్నారు. ఇక తండ్రి పాత్రకు జోడీగా నదియా నటిస్తుందనే ప్రచారం అంతటా జరుగుతోంది. గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన సింహా చిత్రంలోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసారు. డాక్టర్ గా,లెక్చరర్ గా రెండు పాత్రల్లో అదరకొట్టారు. మళ్లీ అదే ఫీట్ రిపీట్ చేసి హిట్ కొట్టబోతున్నట్లు చెప్తున్నారు.

అత్తారింటికి దారేది చిత్రంతో వచ్చిన అత్త స్టార్‌డమ్‌ను నదియా బాగా ఆస్వాదిస్తోంది. కథలు కూడా అన్నీ విని నచ్చితేనే, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే గ్రీన్‌సిగ్నల్ ఇస్తోంది. ఓ రకంగా హీరోయిన్‌కన్నా ఎక్కువ పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందని సమాచారం. తాజాగా బాలకృష్ణ సరసన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం కమిటైందని సమాచారంం. అయితే తండ్రీ కొడుకులుగా బాలయ్య నటిస్తున్న ఈ చిత్రంలో చిన్న బాలయ్యకు అత్తగా నటిస్తుందా? లేక పెద్ద బాలయ్యకు జోడీగా నటిస్తుందా అన్న విషయం త్వరలో తెలుస్తుంది. ఈ చిత్రం కోసం ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. రాధికా ఆప్టే, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. 14రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, వారాహి చలన చిత్ర పతాకంపై తెరకెక్కిస్తున్నారు.గోపీ ఆచంట, రామ్‌ ఆచంట, అనీల్‌ సుంకర, సాయి కొర్రపాటి నిర్మాతలు. సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ గా చేస్తున్నారు.

ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని అంతా మొదట అనుకున్నారు. కానీ పిబ్రవరికి వాయిదా పడుతుందని తెలుస్తోంది. ఎందుకంటే ఎలక్షన్స్ మార్చి ల లేదా ఏప్రియల్ లలో వచ్చేటట్లు ఉండటంతో ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేయనుండటంతో ఈ చిత్రం కొంత వరకూ హెల్ప్ అవుతుందని ఆ దిశగా ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

దర్శకుడు మాట్లాడుతూ.... ''యాక్షన్‌ తరహాలో సాగే బాలకృష్ణ మార్కు సినిమా ఇది. ఆయన నుంచి అభిమానులు ఆశించే అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. ఆద్యంతం అలరించేలా దర్శకుడు సినిమాని తీర్చిదిద్దుతున్నారని'' అన్నారు. సింహా లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత మరోసారి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే అంచనా అభిమానుల్లో ఉండటం సహజం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X