బాలయ్య సేమ్ ఫీట్ ని రిపీట్ చేయటం ఎంతవరకూ సేఫ్?
సింహాతో విజయోత్సాహంలో ఉన్న బాలయ్య తాజాగా దాసరితో పరమవీర చక్ర చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రలలో పోషించనున్నారని సమాచారం. సింహా మాదిరిగానే ఈ సారి కూడా డ్యూయల్ రోల్ చేసి తానేంటో మరోసారి ప్రూవ్ చేయాలని యోచిస్తున్నారని చెప్తున్నారు. బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు తరహాలో లీడ్ రోల్ ని, యంగ్ తరానికి నచ్చే రీతిలో కుర్ర బాలయ్యని ప్రెజెంట్ చేయాలని దాసరి స్క్రిప్టు రాసారని వినపడుతోంది. ఇక ఆర్మి బ్యాక్ డ్రాప్ లో రచింపబడ్డ ఈ స్క్రిప్టులో వర్తమాన రాజకీయాలపై కొన్ని సెటైర్స్ ఉంటాయని, అయితే అవి దాసరి మార్కుతో చురకల్లా గుచ్చుతాయని చెప్పుకుంటున్నారు.
సి.కళ్యాణ్ నిర్మించే ఈ చిత్రంలో ఇప్పటికే హన్సిక హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పటికే హన్సిక నందమూరి హీరోలైన ఎన్టీఆర్ తో కంత్రి, కళ్యాణ్ రామ్ తో జయీభవ చిత్రం చేసిన విషయం తెలిసిందే. దాసరి యంగ్ ఇండియా ఫెయిల్యూర్ ని దృష్టిలో పెట్టుకుని అతి జాగ్రత్తతో మరికొందరు రచయితలతో డిస్కస్ చేసి మరీ స్క్రిప్టుని రూపొందిస్తున్నట్లు చెప్తున్నారు. ఏదైమైనా మరోసారి వెంటనే ద్విపాత్రాభినయం అంటే కొంచెం ఆలోచించి ఉండాల్సిందని బాలయ్య అభిమానులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవన్నీ ప్రక్కన పెడితే ఈ చిత్రంలో చోటు చేసుకోనున్న రాజకీయ సెటైర్స్ మేస్త్రిలా చిరంజీవి మీద పడతాయా లేక లీడింగ్ పార్టీ మీద పడతాయా వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











