»   » లింక్ ఏంటని ... ఆరా తీసిన బాలయ్య

లింక్ ఏంటని ... ఆరా తీసిన బాలయ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన పేరు మీద టైటిల్ పెడతారని, అలాగే టట్టు కూడా ఉందని తెలుసినప్పుడు ఎవరైనా అసలు ఆ మ్యాటరేంటని తెలుసుకోవాలనుకోవటం సహజం. బాలయ్య కూడా అలాగే నాని తాజా చిత్రం కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రం గురించి ఎంక్వైరీ చేసారట. ఈ విషయాన్ని నాని రివీల్ చేసారు.

నాని మాట్లాడుతూ...బాలయ్య తమ సినిమాలో వాడుతున్న జై బాలయ్య టట్టు గురించి, దానికి కథ కు ఉన్న లింక్ గురించి చాలా కాలం క్రితమేఅడిగి తెలుసుకున్నారు. అవకాసముంటే ఒకసారి సెట్ కు కూడా వస్తానన్నారు అంటూ తెలియచేసారు.

Balakrishna enquired about the tattoo

ఈ చిత్రంలో నాని చేతిపై జై బాలయ్య అనే టట్టూ ఉంటుంది. మొదట్లో జై బాలయ్య అనే టైటిల్ పెడదామనుకున్నారు. కానీ చిత్రం ఒక వర్గానికే పరిమితం అయిపోతుందని ఆగి ఈ టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం.

అనంతపురం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ అభిమానిగా నాని నటిస్తున్నాడు. పిరికివాడైన కృష్ణ తను ప్రేమించిన మహాలక్ష్మిని ఎలా దక్కించుకున్నాడు అనే చిత్ర కథాంశంతో కామెడీ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది.

చిత్రం విశేషాల్లోకి వెళితే...'మొన్నంటే టీజర్ 30 సెకండ్స్ అన్నావ్, ఇప్పుడు ట్రైలర్ 2నిముషాలు ఉంది చెప్పేయ్ అని తన ఫ్రెండ్ అడిగితే.. చెప్పాల్సినంతా చెప్తా' అంటూ టీజర్స్, ట్రైలర్స్ లోనే న్ని అదరకొడుతున్నాడు. నాని తన వీరప్రేమగాధను చెప్పేందుకు త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

'అందాల రాక్షసి' ఫేం హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్ర సాంగ్స్ మరియు ట్రైలర్ తాజాగా విడుదలై అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. రిలీజ్ అయిన ట్రైలర్ 'భూమి మీద బ్రతకాలంటే ఆక్సిజన్ ఉండాలి, కానీ ఇక్కడ బ్రతకాలంటే భయం కూడా ఉండాలి. అది మనదగ్గర కావాల్సినంతుంది', ఉన్నపలంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా అని హీరోయిన్ హీరోని అడిగితే ఈ వీక్ దా? లాస్ట్ వీక్ దా?అనే పంచ్ డైలాగ్స్ ఇందులో బోల్డన్ని ఉన్నాయి.

14 రీల్స్ బ్యానర్‌పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకరలు నిర్మిస్తున్న 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ'కు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు. హీరో నానితోపాటు మెహర్ పిర్జాదా, సంపత్ రాజ్, బ్రహ్మాజీలు ఇతర పాత్రలను పోషించారు. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నాని, మెహరీన్, సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, మాస్టర్ శ్రీ పాతమ్, బేబి మోక్ష తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్: వర్మ, ఆర్ట్: అవినాష్ కొల్ల, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లిరిక్స్: కె.కె.(కృష్ణకాంత్), కో డెరక్టర్: సాయి దాసం, డైలాగ్స్: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్.

English summary
Nani revealed that Balayya enquired about ‘Jai Balayya’ tattoo and the connection to his name long ago.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu