దాసరి భారీ నుండి తప్పించుక తిరుగువాడు(బాలయ్య)ధన్యుడు సుమతీ...
చాలా సంవత్సరాల తర్వాత బాలకృష్ణకు 'సింహా" సినిమా హిట్ అయిన సంతోషాన్ని మిగలనీయకుండ చేశాడు దర్శకరత్న దాసరి నారాయణరావు. సింహా హిట్ తో బాలకృష్ణకు టాలీవుడ్ లో పోయిన ఇమేజ్ ను మరలా తెచ్చిపెట్టింది. టాలీవుడ్ వెండితెరపై బాలకృష్ణ మరలా సింహాలాగా విజృంభిస్తాడని, బాలకృష్ణ ఫ్యాన్స్ ఎన్నో కలలు కన్నారు. ఆ కలలన్నీ దాసరిగారు కల్లలు చేశారు. బాలకృష్ణ పరమవీర చక్రతో ఎంతో డిప్రషన్ కు లోనయ్యరని ఫిలింనగర్ లో న్యూస్. దాసరి సినిమాకు ఒప్పుకొని ఎందుకు ఇంత తప్పు చేశానా అని విపరీతంగా బాధపడుతున్నాడని బాలకృష్ణ ఫ్యాన్స్ నుంచి సమాచారం వస్తుంది. పరమవీర చక్రతో బాలకృష్ణ కొత్త సినిమాలకు బిజినెస్ అవుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి నిర్మాతలకు.
సింహాతో ఎంతో మంది నిర్మాతలు బాలయ్యతో సినిమా తీయటానికి ముందుకు వచ్చిన నిర్మాతలు, పరమవీరచక్రతో చాలా మంది వెనక్కి తగ్గినట్టు ఫిలింనగర్ న్యూస్. గతంలో కూడా దాసరి మెగాస్టార్ ను పీడించి లంకేశ్వరుడు తీసి మెగాస్టార్ పరువు తీశాడు. లంకేశ్వరుడు ఫైయిల్ కావటంతో జీవితంలో దాసరితో చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకనే మెగాస్టార్ దాసరికి ఇప్పటివరకు సినిమా ఇవ్వలేదు. ఇది ఇలా ఉంటే దాసరి బాలయ్యతో మరో సినిమా తీయటానికి స్క్రిప్ట్ తయారు చేసుకొని, బాలయ్యకు ఫోన్ చేస్తున్నాడు. ఈ సారి బాలయ్య తెలివిగా దాసరిగారి ఫోను ఎత్తకుండ తప్పించుకుని తిరుగుతున్నాడని ఫిలింనగర్ న్యూస్. సినిమా సక్సెస్ అయితేనే రెండవ సినిమా ఇవ్వని బాలయ్య, ప్లాప్ సినిమా తీసి బాలయ్య కెరీయర్ ను దెబ్బతీసిన దాసరి ముఖాన్ని చూస్తాడా?అనేది పెద్ద ప్రశ్నే...!


Click it and Unblock the Notifications











