దాసరి గొప్పతనాన్ని, ఘనచరిత్రని ఎవరూ కించ పరచలేరు!

By Sindhu

ఆరేళ్ల ఆకలినంతా ఒకే సినిమాతో తీర్చేసుకున్న నందమూరి బాలకృష్ణ అభిమానులు, ఇప్పుడు బాలయ్య తదుపరి చిత్రాన్ని చూసి ఒకింత ఆందోళన చెందుతున్నారు. సింహా మరోసారి తమ అభిమాన నాయకుడిని బాక్సాఫీస్ విజేతగా నిలిపితే, దాని తర్వాత వచ్చే సినిమా మళ్లీ మునుపటి అగాధాల్లోకి, అంధకారంలోకి నెట్టేస్తుందేమోనని కంగారు పడుతున్నారు. దాసరి నారాయణరావు గొప్పతనాన్ని, ఘనచరిత్రని ఎవరూ కించ పరచలేరు కానీ, ఇటీవలి ాయన రికార్డుని చూసి శంకించకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. దాసరి నారాయణరావు 150 చిత్రం కనుక ప్రతిష్టాత్మక చిత్రంగా 'పరమవీర చక్ర" కి కావాల్సినంత హంగామా ఉంటుంది. కానీ అంతటి హంగు, రంగు సినిమాలో ఉంటుందా అన్నదే వారిని వేధిస్తోంది.

నిన్న కాక మొన్న వచ్చిన 'యంగ్ ఇండియా" చూస్తేనే దాసరి ఆలోచనలో ఎంత ఓల్డ్ అయిపోయాయన్నది స్పష్టంగా అర్థమయింది. మరి తర్వాతి చిత్రానికే దాసరి తనని తాను 30 ఏళ్లు అప్ డేట్ చేసుకుని, బాలయ్యకి ఈ తరాన్ని మెప్పించే సినిమా ఇచ్చేస్తారా అన్నదే అనుమానానికి తావిస్తోంది. సింహా చిత్రంతో బాలయ్య కష్టపడి మళ్లీ పైకి చేరినప్పుడు అతని మీదకు తాడు విసరడమే చరిత్ర తిరగరాసేస్తారేమో అనుకుందామంటే ..దాసరి 100వ సినిమా గుర్తొచ్చి గుండే గుభేల్ మంటోంది. చిరంజీవితో ఇంతకంటే ఆర్భాటంగా వచ్చిన దాసరి 100వ చిత్రిం'లంకేశ్వరుడు" బయ్యర్లుకు వట్టిచేతుమిగిల్చిపోయింది. 'పరమవీర చక్ర" కైనా దాసరి ముప్ఫయేళ్ళ నాటి తన పంచ్ ని, పవర్ ని తిరిగి తెచ్చుకుంటారా?లేదంటే..ఒక్క హిట్టు తర్వాత కనీసం మూడు నాలుగేళ్ల పాటు పీడించే పీడకలలు బాలయ్యకి, అభిమానులకీ మళ్లీ తప్పవంటారా?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X