దాసరి సిగ్గుమాలిన తననానికి ప్రతీకగా బాలయ్య ‘పరమవీర చక్ర’
దాసరి నారాయణరావు కనిపిస్తే ఏం చేస్తామో తెలీదని నందమూరి బాలకృష్ణ అభిమానులు ఊగిపోతున్నారు. తమ హీరోతో సినిమా తీస్తూ బుర్రకథ, వీధి నాటకాలని తలదన్నే చిత్రీకరణతో చావగొడతావా అంటూ నందమూరి ఫ్యాన్స్ కారాలు, మిరియాలు నూరుతున్నారు. 'సింహా" తో మళ్లీ బాలకృష్ణకి మహర్థశ పడుతుందని ఆశిస్తే, అతడిని మళ్లీ అంధకారంలోకి నెట్టేసి పరాజయాన్ని అందించినందుకు వారు ఆగ్రహం పట్టలేకపోతున్నారు.
ఈ సినిమా చూశాక ప్రేక్షకులు 'కాబోయే సిఎం" అంటారని దాసరి ఊరించగా, ఇది చూసిన వాళ్లు 'బాబోయ్ బాలయ్య"అంటుండడం విని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పైగా ఈ దిక్కుమాలిన సినిమాతో బాలకృష్ణకి జాతీయ అవార్డు వస్తుందని అనడం దాసరి సిగ్గుమాలిన తననానికి ప్రతీక అని వారు రెచ్చిపోతున్నారు. దాసరి తమ చేతికి దొరికితే మాత్రం ఆయనకు తమ చేతిలో 'పరమవీర చక్ర" తప్పదని హెచ్చరితస్తున్నారు...
More from Filmibeat
బాలకృష్ణ దాసరి నారాయణ రావు పరమవీర చక్ర అమీషా పటేల్ షీలా నేహా ధూపియా balakrishna dasari narayana rao parama veera chakra amisha patel sheela neha dhupia


Click it and Unblock the Notifications











