చిరుకు జరిగినట్టే బాలయ్యకు జరిగితే!?
దర్శకరత్న దాసరి నారాయణ రావు 150 చిత్రంగా నందమూరి నటసింహం బాలకృష్ణతో 'పరమవీర చక్ర" సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రేమికులు గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో 99 చిత్రాలను నిర్మించి మంచి ఊపుమీద ఉన్న దాసరి 100వ చిత్రంగా చిరంజీవితో 'లంకేశ్వరుడు" అనే చిత్రాన్ని రూపొందించారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా అనూహ్య రీతిలో ఘొర పరాజయం పాలైంది. దాసరి నారాయణ రావు, చిరంజీవి కాంబినేషన్ లో అదే మొదటి మరియు చివరి సినిమా.
తాజా గా ఇప్పుడు 149 చిత్రాలు పూర్తి చేసిన దాసరి బాలయ్యతో 150వ చిత్రంగా 'పరమవీరచక్ర" రూపొందిస్తుండటం..దాసరి నారాయణ రావు, బాలకృష్ణ కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా కావడంతో చిరుకు జరిగిందే బాలయ్యకు రిపీటవుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే దాసరి మాత్రం అలా జరిగే అవకాశాలు లేవు. బాలకృష్ణ, చిరంజీవి నాకు ఇద్దరూ ఈక్వెలే, నాకు ఇద్దరూ మంచి ఫ్రెడ్స్ వారు ఇద్దరూ రెండు (ఇతర)పార్టీలకు సంబంధించిన వారైనా సినిమా రంగాని, పాలిటిక్స్ సంబందం లేదు కనుకనే అప్పుడు చిరంజీవితో తీశా, ఇప్పుడు బాలయ్య తో తీస్తున్నానన్నారు. అయితే ఇందులో నిజం ఎంత వరకూ ఉందో వీటన్నింటికి తెరపడాలంటే సినిమా వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











