బాలకృష్ణ నెక్ట్స్ ఆ స్టార్ డైరక్టర్ తో ఖరారు
ప్రస్తుతం శ్రీమన్నారాయణ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న బాలకృష్ణ తాజాగా మరో చిత్రం కమిటయ్యారని సమాచారం. వివి వినాయిక్ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. రామ్ చరణ్ తో చిత్రం చేస్తున్న వినాయిక్ తన తదుపరి చిత్రం బాలయ్య తో చేయాలని ఫిక్స్ అయ్యినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తన సాయి గణేష్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నరని తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ తో ఉంటుందని చెప్తున్నారు. గతంలో బాలకృష్ణ,వినాయిక్ కాంబినేషన్ లో చెన్నకేసవ రెడ్డి చిత్రం వచ్చి ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.
ఇక ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ఆనాటి సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ 'ఆదిత్య 369'సీక్వెల్ తీస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అనూష్కని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి కానీ ఇంకా ఖరారు కాలేదు. అలాగే ఈ సినిమాని సింగీతం శ్రీనివాసరావు మరియు వినోద్ కలిసి నిర్మించనున్నారు. కొండ కృష్ణం రాజు ఈ సినిమాని సమర్పించనున్నారు. ఈ సంవత్సరం ఆగష్టు నుండి ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
అలాగే బాలకృష్ణ గెస్ట్ గా నటించిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం కూడా విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలో మనోజ్ హీరోగా చేస్తున్నారు. మంచు లక్ష్మి ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలకృష్ణ ఈ ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ...'శ్రీరామరాజ్యం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం. ఓ వరం' అని అన్నారు. ఇందులోని పాత్రలకు, గంధర్య మహల్ సెట్‌కు వున్న సంబంధమేంటో సినిమా చూశాకే తెలుస్తుందని,రక్షా బంధన్ రోజున ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని లక్ష్మీ ప్రసన్న తెలిపింది.


Click it and Unblock the Notifications











