బాలకృష్ణ డైరక్ట్ చేసే చిత్రం ఆ హాలీవుడ్ కాపీ???

By Srikanya

హైదరాబాద్: బాలకృష్ణ త్వరలో దర్శకుడుగా కనపించటానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త ప్రచారం జోరందుకుంది. బాలకృష్ణ డైరక్ట్ చేయబోయే చిత్రం ఓ హాలీవుడ్ యానిమేషన్ చిత్రం కాపీ అని అంటున్నారు. ఆ చిత్రం ..డిస్నీ వారి పాపులర్ చిత్రం 'ది లయిన్ కింగ్'. ఈ చిత్రం కథని జానపదంలో రాజుల కథగా మార్చి రూపొందిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ సిని రచయిత హరినాధరావు, వేణు ఈ చిత్రం స్క్రిప్టుపై పనిచేస్తున్నట్లు సమాచారం.

నందమూరి బాలకృష్ణ మెగాఫోన్ పట్టుకోవడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దర్శకత్వంపై మక్కువ బాలయ్యకు ఇప్పుడు కొత్తగా పుట్టిందేంకాదు. గతంలోనే ఆయన 'నర్తనశాల' చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో చేసే ప్రయత్నం చేశారు. పైగా అర్జునుడు, బృహన్నల, కీచకుడు, కృష్ణుడు, సుయోధనుడు పాత్రలను అందులో బాలయ్య నటిస్తారని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ద్రౌపది పాత్రకు ఎంచుకున్న సౌందర్య ఆకస్మిక మృతితో ఆ సినిమా నిర్మాణం పక్కకు వెళ్లిపోయింది

తర్వాత 'శ్రీరామరాజ్యం' తర్వాత మళ్లీ బాలకృష్ణ 'నర్తనశాల'ను ట్రాక్ పైకి తీసుకురానున్నారనీ, నయనతార ద్రౌపదిగా నటిస్తారనీ ఓ వార్త మీడియాలో షికారు చేసింది. అయితే అది నిజమో కాదో తేలో లోగా...... ఈ తాజావార్త వెలుగు చూసింది. బాలకృష్ణ త్వరలోనే దర్శకత్వం చేయబోతున్నారు. నయనతారే హీరోయిన్. బాలయ్య హీరోగా 'శ్రీరామరాజ్యం' లాంటి ఉత్తమ చిత్రాన్ని నిర్మించిన యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

ఓ జానపద చిత్రం ఈ సినిమా. అలాగే ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్‌కి వెళ్లనుందని విశ్వసనీయ సమాచారం. 'శ్రీమన్నారాయణ' చిత్రం తర్వాత బాలయ్య వేరే ఏ సినిమాకూ సైన్ చేయలేదు. హీరోగా కెరీర్ మొదలైన తర్వాత ఆయన ఇంత గ్యాప్ తీసుకోవడం ఇదే ప్రథమం. బాలయ్య విరామానికి కారణం ఏంటో అంతుపట్టని స్థితిలో ఆయన అభిమానులు ఉన్నారు. అలాంటి సమయంలో వెలుగుచూసిన ఈ వార్త అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే... త్వరలోనే బాలకృష్ణలోని దర్శక కోణాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X