Mokshagna Entry: కొడుకు సినీఎంట్రీపై కుండబద్దలు కొట్టిన బాలయ్య.. అభిమానులకు బ్యాడ్ న్యూస్!
నందమూరి అభిమానులందరూ అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న విషయం ఏదైనా ఉందంటే... అది నందమూరి మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ మాత్రమే. ఇప్పటికే ఆయన సినిమా హీరోగా ఎంటర్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఎందుకో కానీ అది వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంటర్ గురించి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తెర మీదకు ప్రచారాలు: నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ సినిమా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త ఇప్పటిది కాదు... లెజెండ్ సినిమా సమయంలో షూటింగ్ కి మోక్షజ్ఞ హాజరవడంతో అప్పటినుంచి ఆయన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆయన సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. అదిగో ఆ దర్శకుడితో సినిమా ఓకే అయింది. ఇక పట్టాలెక్కడమే ఆలస్యం అంటూ ఎప్పటికప్పుడు ప్రచారాలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి.

మోక్షజ్ఞ ఫోటోలు వైరల్: కానీ ఆయన నిజానికి ఒక్క సినిమా కూడా ఓకే చేసింది లేదు. అయితే మోక్షజ్ఞ కొన్నాళ్ల క్రితం వరకు లావుగా బొద్దుగా కనిపిస్తూ ఉండేవాడు కానీ ఇప్పుడు సినిమా హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన తరుణంలో నాచురల్ పద్ధతుల్లో బరువు కూడా తగ్గాడు. ఈ మధ్యకాలంలో కొన్ని మోక్షజ్ఞ ఫోటోలు వైరల్ అవ్వగా నందమూరి అభిమానులు అందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారు.
ఆ సీక్వెల్ తోనే: ఇక తమ వారసుడు సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైందని వారంతా ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు అమెరికాలోని తానా సభలకు హాజరైన నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా జరిగిన తానా సభలలో ఆఫ్ ది రికార్డుగా కొంతమందితో బాలకృష్ణ మాట్లాడుతూ మోక్షజ్ఞ తేజ ఎంట్రీ సినిమాగా ఆదిత్య 369 సినిమా సీక్వెల్ ఉండబోతుందని వెల్లడించినట్లు తెలుస్తోంది.

అభిమానులకు బ్యాడ్ న్యూస్: ఆ సినిమాకి దర్శకుడు ఎవరు అనే విషయం మీద ఆయన క్లారిటీ ఇవ్వకపోగా 2024 ఎన్నికల తర్వాత తాను ఆ సినిమా మీద దృష్టి పెట్టి తెరకెక్కిస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే బోయపాటి ఆ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నా.. బాలకృష్ణ స్వయంగా డైరెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని వాదన వినిపిస్తోంది. నిజానికి నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గా వ్యవహరించాలని గతంలోనే ప్రయత్నించారు. కానీ ఎందుకో అది కుదరలేదు.

బాలకృష్ణ డైరెక్షన్: ఇక నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ తేజ లాంచింగ్ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్నఈ సినిమాకి భగవంత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో కూడా నందమూరి బాలకృష్ణ ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఎన్నికల మీద ఆయన దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











