బాలకృష్ణ 'గాడ్సే' టైటిల్ మారింది

By Srikanya

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ హీరోగా సత్యదేవా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. రుద్రపాటి రమణారావు నిర్మాత. ఈ చిత్రానికి గాడ్సే అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ టైటిల్ పై అభిమానుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. దానికి తోడు సెన్సార్ వద్ద కూడా ఈ టైటిల్ పాస్ కాదు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ టైటిల్ మార్చాలనుకుంటున్నట్లు సమాచారం. కొత్త టైటిల్ ...'వారియర్' అని తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.

ఇక సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రీసెంట్ గా ...'హైసా అంబానీ పిల్లా...' అంటూ సాగే హుషారైన గీతాన్ని బాలకృష్ణ, త్రిషపై చిత్రీకరించారు. రామోజీ ఫిల్మ్‌సిటీతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ గీతాన్ని తెరకెక్కించారు. శ్రీమణి సాహిత్యమందించిన ఈ గీతాన్ని మణిశర్మ స్వరపరిచారు. నోబుల్‌ నృత్యరీతులు సమకూర్చారు.

Balakrishna Godse may become warrior

''ప్రజల క్షేమాన్ని కోరుకునే ఓ ఉన్నత ఉద్యోగి జీవితమిది. నాయకుడంటే ఇలా ఉండాలనేలా బాలకృష్ణ పాత్రను సత్యదేవా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి'' అంటున్నారు నిర్మాత.

ఈ చిత్రంలో బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం. నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకట్‌ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X