Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
8 ఏళ్ళ తరువాత మరో యంగ్ హీరో సినిమాలో బాలయ్య గెస్ట్ రోల్
స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ చేస్తే చాలు సినిమాకు ఒక మంచి హైప్ క్రియేట్ అవుతుంది. కానీ ఈ మధ్య గెస్ట్ రోల్స్ కంటే ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలే వస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అతిధి పాత్రలు చేసింది చాలా తక్కువ. ఇక 2012లో గెస్ట్ రోల్ అని కాకుండా ఒక యువ హీరో సినిమాలో కీలక పాత్రలో నటించాడు బాలకృష్ణ. ఆ సినిమా మరేదో కాదు. ఉ కొడతారా? ఉలిక్కిపడతారా?.
మంచు మనోజ్ హీరోగా నటించిన ఆ సినిమాలో బాలకృష్ణ చేసిన పవర్ఫుల్ రోల్ బాగానే క్లిక్కయ్యింది గాని సినిమా కథనం కారణంగా డిజాస్టర్ అయ్యింది. కానీ బాలయ్య పర్ఫెమెన్స్ మాత్రం ఆ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా ఉంటుంది. ఇక దాదాపు 8 ఏళ్ళ తరువాత బాలయ్య మరో యంగ్ హీరో సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆ యంగ్ హీరో ఎవరంటే.. ఈ మధ్య డీసెంట్ హిట్స్ తో మార్కెట్ ని పెంచుకుంటున్న నాగ శౌర్య. బాలయ్యతో ఆదిత్య 369, వంశానికొక్కడు వంటి సినిమాలు తీసిన శివలెంక కృష్ణ ప్రసాద్ ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథలో నాగశౌర్యను హీరోగా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆ కథలో ఒక బలమైన పాత్ర కోసం బాలకృష్ణ అయితే కరెక్ట్ గా సెట్టవుతాడాని నిర్మాత ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నిర్మాత ఇప్పటికే బాలయ్యకు విషయాన్ని చెప్పగా ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని చెప్పలేదని సమాచారం. త్వరలోనే ఎదో ఒకటి చెప్పేస్తారని టాక్ అయితే వస్తోంది. మరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.