అటెకెక్కిన బాలయ్య ‘హర హర మహదేవ’?

By Bojja Kumar

నందమూరి అగ్రహీరో బాలకృష్ణ, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శకుడు బి. గోపాల్ కాంబినేషన్‌లో రాబోతోన్న 'హర హర మహదేవ" సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగి పోయిందా? ఇక ఆ సినిమా అటకెక్కినట్లేనా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం గత కొన్ని రోజులుగా హరహర మహేదేవ షూటింగ్ జరుగడం లేదు. కనీసం ఆ సినిమా గురించి ఎలాంటి యాక్టీవిటీస్ ఊసేలేదు. మరి ఈ సినిమా సంగతి ఏమైందనే విషయం ఆరా తీస్తే...హర హర మహదేవ స్క్రిప్టుపై బాలయ్య, బెల్లంకొండ సంతృప్తిగా లేరట.

అ స్టోరీ ఇప్పటి తరానికి నచ్చే విధంగా లేక పోవడంతో...దాన్ని నమ్ముకుని సినిమా తీసి చేతులు కాల్చు కోవడం కంటే, అటకెక్కించడమే బెస్ట్ అని ఇద్దరూ అభిప్రాయ పడుతున్నారని తెలుస్తోంది. గతంలో భీష్మ సినిమా సూటింగ్ కూడా అర్ధాంతరంగా అటకెక్కింది. మళ్లీ ఆ సినిమా ఊసే లేదు ఇప్పటి వరకు. భీష్మ దారిలోని హర హర మహదేవ అటకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక పోతే బాలయ్య ప్రస్తుతం అధినాయకుడు షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X