Vishwambhara చిరంజీవి కాంపౌండ్‌లోకి బాలయ్య హీరోయిన్... భలే ఛాన్స్ కొట్టేసిందే!
హనిరోజ్ ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి'తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో ఆమె గ్లామర్‌కు అందరూ ఫిదా అయ్యారు. అయితే ఆ సినిమా తర్వాత ఆమె మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. దీంతో ఆమె కోసం చాలా కాలం తెలుగు ఆడియెన్స్ ఎదురుచూసి విసిగిపోయారు కూడా. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మకు తెలుగులో ఓ సూపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం అందుకున్నట్లు సమాచారం అందుతోంది. వివరాల్లోకి వెళితే..
మాల్స్ ఓపెన్సింగ్స్తో బిజీగా : హనిరోజు.. వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ తర్వాత తెలుగులో మరే చిత్రంలోనూ నటించలేదు. ఈ సినిమా రిలీజై ఏడాది దాటేసినా ఆమె ఇంకా అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది. సోషల్ మీడియాలో గ్లామర్‌ను ఆరబోస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. కేవలం మాల్స్ ఓపెన్సింగ్ లేదా ఇతర ఫంక్షన్లలోనే కనిపిస్తూ ఆ వేడుకలతోనే బిజీగా కనిపిస్తోంది. వాటికి సంబంధించి గ్లామర్ ఫొటోలను నెట్టింట్లో పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. అలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే 4.2 మిలియన్ల ఫాలోవర్స్‌ను అందుకుంది.

పాన్ ఇండియా సినిమాలో : అయితే ఆ మధ్య మాత్రం రెండు సినిమాల్లో మాత్రం నటిస్తున్నట్లు అనౌన్స్ చేసింది హనీరోజ్. రాచెల్, తెరీ మెరీ అనే చిత్రాల్లో నటిస్తోంది. అయితే అవి తెలుగులో డైరెక్ట్‌గా తెరకెక్కట్లేదు. ఇందులో రాచెల్ మాత్రం పాన్ ఇండియా రేంజ్లో రానుంది. తెరీ మెరీలో లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమాలకు సంబంధించి కేవలం పోస్టర్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇతర అప్డేట్స్ ఏమీ రాలేదు.
మెగాస్టార్ సినిమాతో : ఇప్పుడు ఇంతకాలానికి తెలుగులో ఆమె ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సారి కూడా సీనియర్ హీరోతో జతకట్టబోతున్నదని సమాచారం అందింది. మెగాస్టార్ సరసన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. బింబిసార దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్గా షూటింగ్ కూడా మొదలైంది. విజువల్ వండర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్స్ రిలీజై ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని మొదటి నుంచి టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అనుష్క, నయనతార, కాజల్, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపించగా ఇప్పుడు హనిరోజ్ పేరు వినిపిస్తోంది. చర్చలు జరుగుతున్నాయని బయట కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి ఉండాల్సిందే..


Click it and Unblock the Notifications











