బాలయ్య కోసం భామల దిగుమతికి భారీగా ఖర్చుపెడుతున్నారు...!?
మిగిలిన హీరోల సినిమాల మేకింగ్ భారీ బడ్జెట్ అవసరమవుతుంటే బాలకృష్ణకి మాత్రం హీరోయిన్స్ ని సెట్ చేసేందుకే భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇలియానా, కాజల్, హన్సిక వంటి హీరోయిన్స్ అందరూ బాలకృష్ణలాంటి సీనియర్ సరసన నటించలేమని తప్పించుకుంటూ వుండడం బాలయ్య చిత్రాల ప్రొడ్యూసర్స్ కి పెద్ద తలపోటుగా మారిందిప్పుడు.
ప్రస్తుతం 'పరమవీర చక్ర" లో ద్విపాత్రాభినయం చేస్తోన్న బాలకృష్ణ కోసం ఇద్దరు కథానాయికలను తీసుకువచ్చేందుకై నిన్న మొన్నటివరకూ నానాతంటాలూ పడ్డ నిర్మాత సి. కళ్యాణ్ చివరికి అమీషా పటేల్, షీలాలను ఒప్పించగలిగారు. అయితే బిజీగా లేకున్నా, క్రేజీ హీరోయిన్స్ కాకున్నా వాళ్ళిద్దరికి కూడా బాలయ్య సరసన చేస్తున్నందకు భారీగానే సమర్సించుకోవాల్సి రావడం విశేషం. తెలుగులో ఆఫర్స్ కోసం ఆశగా చూసిన షీలా బాలయ్య సినిమా అనగానే ముప్పై లక్షలు ఇవ్వాల్సి వచ్చిందట. 'సింహా" తో పెద్ద హిట్టు కొట్టాక కూడా ఇదీ పరమ వీరుని పరిస్థితి..


Click it and Unblock the Notifications











