గ్రేట్...టెర్రరిజాన్నే చంపేస్తానంటున్న బాలకృష్ణ
రేయ్...ఎంతమంది టెర్రరిస్టులను చంపినా ఇంకా ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నార్రా. అందుకే నేను టెర్రరిస్టులతో పాటు..టెర్రరిజాన్నే చంపేయటానికి వచ్చానురా అంటూ ఆవేశంగా డైలాగులు చెప్తున్నారు బాలకృష్ణ. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపొందుతున్న పరమవీరచక్ర చిత్రంలోనిదీ డైలాగు. బాలకృష్ణ..ఆర్మీ మేజర్ గెటప్ లో ఈ డైలాగులను చెప్తూ టెర్రరిస్టులపై విరుచుకుపడుతూంటారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు అమీషా పటేల్, నేహా ధూపియాలు, షీలా చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో సినిమా స్టార్ గా ఓ పాత్రను చేస్తున్నారు. అతన్ని డైరక్ట్ చేసే దర్శకుడుగా శ్రీను వైట్ల కనిపిస్తారు. ఇక...రీసెంట్ హిట్ సింహాను తలదన్నే చిత్రంగా పరమవీరచక్రను చూడాలని బాలకృష్ణ బలంగా కోరుకుంటూ కష్టపడుతున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











