Remuneration: డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్‌తో రెమ్యునరేషన్ పెంచిన బాలయ్య.. నెక్ట్స్ మూవీకి ఎంతో తెలుసా?
ఇప్పుడు సౌత్ సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ హీరోస్ ఎలాంటి ఫామ్ లోకి వచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ స్టార్స్ లో తమిళ్ నుంచి మాత్రమే కాకుండా తెలుగు నుంచి కూడా మన సీనియర్ హీరోలు తమ ఏజ్ కి తగ్గట్టుగా సాలిడ్ పాత్రలు చేస్తూ సెన్సేషన్ ని సెట్ చేస్తున్నారు. కాగా ఇలా మన తెలుగులో ఉన్నటువంటి సీనియర్ హీరోస్ లో ఒకరైన నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఒకరు.
కాగా బాలయ్య తన కెరీర్ లో చేసిన ఎన్నో సినిమాల్లో పలు ట్రోల్స్ కి కూడా గురైన సినిమాలు ఉన్నాయి. అయితే తన మాస్ కి తగ్గ సాలిడ్ సినిమా కానీ పడితే అది ఏ రేంజ్ లో ఉంటుంది అనేది మాత్రం పలు సినిమాలు చూపించాయి. కాగా కొన్నేళ్ల పాటుగా బాలయ్య ప్లాప్ సినిమాలతో సతమతం అయ్యారు కానీ లేటెస్ట్ గా మాత్రం తనలోని వెర్షన్ 2.0 ని చూపించారు అని చెప్పాలి. ఇలా తనలోని వెర్షన్ 2.0 నుంచి మొదలు పెట్టిన బాలయ్య ఇపుడు సాలిడ్ వసూళ్లు రాబడుతూ ఒక స్టడీ పెర్ఫామెన్స్ ని అయితే తాను చూపిస్తున్నారు.

ఇక దీని ఫలితం తన సినిమా ఒకోడానికి భారీ రెమ్యునరేషన్ ని పెంచుకుంటూ వెళుతున్నారట. తాను అవ్వడానికి సీనియర్ హీరో అయినప్పటికీ ఒకపుడు తన రెమ్యునరేషన్ ప్రెజెంట్ ఉన్న మిడ్ రేంజ్ యంగ్ హీరోస్ కంటే తక్కువే ఉండేది. కానీ ఇపుడు ఫైనల్ గా తన రేంజ్ 8 కోట్ల నుంచి ఏకంగా 40 కోట్లకి చేరినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా బాలయ్య తన కెరీర్ 2.0 స్టార్ట్ చేసిన సినిమా "అఖండ" కి కేవలం 8 కోట్లు మాత్రమే తీసుకుంటే ఆ సినిమా పెద్ద హిట్ అయ్యాక అక్కడ నుంచి వీర సింహారెడ్డికి 14 కోట్లు తీసుకొన్నారు. ఒక్కొ సినిమా మరింత హిట్ అవుతూ వస్తున్న నేపథ్యంలో తన నెక్స్ట్ సినిమాలకి ఏకంగా 40 కోట్ల రెమ్యునరేషన్ ని అందుకోనున్నట్టుగా తెలుస్తుంది.
మరి లేటెస్ట్ గా వచ్చిన తన మరో బిగ్ హిట్ చిత్రం డాకు మహారాజ్ కి కూడా తాను 27 కోట్లకి పైగా పారితోషికం తీసుకున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో మొత్తానికి బాలయ్య మాత్రం ఓ రేంజ్ లో గ్రాఫ్ ని పెంచుకుంటూ వెళుతూ దుమ్ము లేపుతున్నారని చెప్పాల్సిందే. ఇక బాలయ్య హీరోగా నెక్స్ట్ అఖండ పార్ట్ 2 దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తుండగా ఈ సినిమా తర్వాత మళ్ళీ వీరసింహ రెడ్డి సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నారని తెలుస్తుంది. కాగా ఈ సినిమాకే బాలయ్య తన కెరీర్ అత్యధిక రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నారట.

దీనితో మన సీనియర్ హీరోస్ లో అత్యధిక రెమ్యునరేషన్ ని తీసుకుంటున్న రెండో టాప్ హీరోగా ఉన్నారట. కాగా తనకంటే ముందు టాప్ 1 స్థానంలో మెగాస్టార్ చిరంజీవే ఉన్నారని తెలుస్తుంది. తన తర్వాత బాలయ్య ఇపుడు రెండో ప్లేస్ కి వచ్చారట.


Click it and Unblock the Notifications











