Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
NBK106 Update: బోయపాటి కోసం బాలకృష్ణ కఠోరంగా.. కేక పుట్టించే విధంగా
గౌతమిపుత్ర శాతకర్ణితో సెంచరీ కొట్టిన నందమూరి బాలకృష్ట సినిమాల వేగం పెంచారు. తాజాగా తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో ఓ సినిమాను కొనసాగిస్తూనే మరో సినిమా బోయపాటి శ్రీనుతో చేసేందుకు సిద్దమవుతున్నారు. బోయపాటితో మూవీ ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. కానీ కథలో మార్పులు చేర్పుల వల్ల వాయిదా పడి కేఎస్ రవికుమార్ సినిమా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తన కెరీర్లో 106వ సినిమాకు సంబంధించిన ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇంతకి ఆ వార్త ఏమిటంటే..
బోయపాటి కోసం
బోయపాటి శ్రీను తయారు చేసిన స్క్రిప్టు ప్రకారం బాలకృష్ణ కొత్త అవతారంలో కనిపిస్తారట. ఆ లుక్ కోసం భారీగా బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారు. కొత్త లుక్ ఫ్యాన్స్‌ను అలరిస్తుందనే అభిప్రాయాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తున్నది. అలాంటి పాత్ర కోసం ఆహార సంబంధిత నియమాలను తూచ తప్పకుండా పాటిస్తున్నట్టు సమాచారం.
ఆహారపరంగా కఠినంగా
ఫిలింనగర్ సమాచారం ప్రకారం.. ఎన్బీకే106 కోసం తన రూపాన్ని మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని రోజులుగా అన్నం తినడం మానేశారట. దాంతో బాలయ్య బాబులో చాలా మార్పులు కనిపిస్తున్నాయని తెలిసింది. అయితే ఇంత వరకు తన కెరీర్లో పోషించని పాత్ర కోసం చాలా నిష్టగా ఉంటున్నట్టు సమాచారం.
హ్యాట్రిక్ కోసం కసరత్తు
ఎన్బీకే106 సినిమా కోసం బాలకృష్ణ, బోయపాటి శ్రీను మూడోసారి జతకట్టారు. గతంలో సింహా, లెజెండ్ సినిమాలతో ప్రేక్షకులను ఆలరించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ కాంబో రెడీ అయింది. బాలకృష్ణ సూచించిన మార్పులను స్క్రిప్టులో చేసుకొని బోయపాటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టు తెలిసింది.
జైసింహా తర్వాత రెండో హిట్టు కోసం
ఇక శరవేగంగా జరుగుతున్న రూలర్ సినిమా షూట్ త్వరలోనే ముగించుకొనే ప్రయత్నంలో ఉన్నారు జైసింహ తర్వాత మరో హిట్టను ఖాతాలో వేసుకొనే దిశగా ఈ జోడి ప్లాన్ చేసింది. ఇక రూలర్ సినిమాలో సోనాల్ చౌహాన్‌ను హీరోయిన్గా తీసుకొన్నారు. ఈ చిత్రంలో బాలయ్య లుక్ ఇప్పటికే క్రేజ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథ గజనీ సినిమాను పోలీ ఉంటుందనే మాట వినిపిస్తున్నది.