twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NBK106 Update: బోయపాటి కోసం బాలకృష్ణ కఠోరంగా.. కేక పుట్టించే విధంగా

    |

    గౌతమిపుత్ర శాతకర్ణితో సెంచరీ కొట్టిన నందమూరి బాలకృష్ట సినిమాల వేగం పెంచారు. తాజాగా తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో ఓ సినిమాను కొనసాగిస్తూనే మరో సినిమా బోయపాటి శ్రీనుతో చేసేందుకు సిద్దమవుతున్నారు. బోయపాటితో మూవీ ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. కానీ కథలో మార్పులు చేర్పుల వల్ల వాయిదా పడి కేఎస్ రవికుమార్ సినిమా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తన కెరీర్‌లో 106వ సినిమాకు సంబంధించిన ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇంతకి ఆ వార్త ఏమిటంటే..

    బోయపాటి కోసం

    బోయపాటి కోసం

    బోయపాటి శ్రీను తయారు చేసిన స్క్రిప్టు ప్రకారం బాలకృష్ణ కొత్త అవతారంలో కనిపిస్తారట. ఆ లుక్‌ కోసం భారీగా బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారు. కొత్త లుక్‌ ఫ్యాన్స్‌ను అలరిస్తుందనే అభిప్రాయాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తున్నది. అలాంటి పాత్ర కోసం ఆహార సంబంధిత నియమాలను తూచ తప్పకుండా పాటిస్తున్నట్టు సమాచారం.

    ఆహారపరంగా కఠినంగా

    ఆహారపరంగా కఠినంగా

    ఫిలింనగర్ సమాచారం ప్రకారం.. ఎన్‌బీకే106 కోసం తన రూపాన్ని మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం కొన్ని రోజులుగా అన్నం తినడం మానేశారట. దాంతో బాలయ్య బాబులో చాలా మార్పులు కనిపిస్తున్నాయని తెలిసింది. అయితే ఇంత వరకు తన కెరీర్‌లో పోషించని పాత్ర కోసం చాలా నిష్టగా ఉంటున్నట్టు సమాచారం.

    హ్యాట్రిక్ కోసం కసరత్తు

    హ్యాట్రిక్ కోసం కసరత్తు

    ఎన్‌బీకే106 సినిమా కోసం బాలకృష్ణ, బోయపాటి శ్రీను మూడోసారి జతకట్టారు. గతంలో సింహా, లెజెండ్ సినిమాలతో ప్రేక్షకులను ఆలరించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ కాంబో రెడీ అయింది. బాలకృష్ణ సూచించిన మార్పులను స్క్రిప్టులో చేసుకొని బోయపాటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టు తెలిసింది.

    జైసింహా తర్వాత రెండో హిట్టు కోసం

    జైసింహా తర్వాత రెండో హిట్టు కోసం

    ఇక శరవేగంగా జరుగుతున్న రూలర్ సినిమా షూట్ త్వరలోనే ముగించుకొనే ప్రయత్నంలో ఉన్నారు జైసింహ తర్వాత మరో హిట్టను ఖాతాలో వేసుకొనే దిశగా ఈ జోడి ప్లాన్ చేసింది. ఇక రూలర్ సినిమాలో సోనాల్ చౌహాన్‌ను హీరోయిన్‌గా తీసుకొన్నారు. ఈ చిత్రంలో బాలయ్య లుక్ ఇప్పటికే క్రేజ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథ గజనీ సినిమాను పోలీ ఉంటుందనే మాట వినిపిస్తున్నది.

    English summary
    Balakrishna and Boyapati Srinu had previously teamed up for Simha and Legend, redefining the tenets of mass cinema. As such, fans are bound to have high expectations from NBK 106.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X